Press Release

Filter by:
WhatsApp Image 2026-11-06 at 12.19.23 PM (1)

ఏండగండి లాకులను పరిశీలించి, వరద పరిస్థితిపై ప్రజలతో మాట్లాడిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

Published on: 06/11/2026

ఉండి మండలం ఏండగండి గ్రామంలో ఉన్న లాకులను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వరద పరిస్థితులు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. వరద నీటి ప్రవాహం, లాకుల పరిస్థితిని నిరంతరం గమనిస్తూ అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి […]

WhatsApp Image 2026-11-05 at 11.48.52 AM

తణుకు నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు.

Published on: 05/11/2026

  గురువారం తణుకు మండలం, వేల్పూరు గ్రామంలోలో పోలింగ్ కేంద్రాల వద్ద వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి తక్షణమే స్పందించారు. నీటిని తొలగింపుకు సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి ఓటర్లకు, సిబ్బందికి రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రహదారి ఏర్పాట్లు చేయించారు. ​ ​జిల్లాలోని అన్ని కేంద్రాల్లో ఉదయం 7:00 గంటలకే పోలింగ్ సజావుగా ప్రారంభమైందన్నారు. ​జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,52,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు. దీనికోసం మొత్తం 1,244 […]

WhatsApp Image 2026-11-05 at 1.15.40 PM

ఉండి మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

Published on: 05/11/2026

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని, ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా […]

WhatsApp Image 2026-11-05 at 1.52.54 PM

మొగల్తూరు మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

Published on: 05/11/2026

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని, ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా […]

WhatsApp Image 2026-11-05 at 8.11.17 PM

ఎస్ఆర్ఆర్‌కేఆర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లు, రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

Published on: 05/11/2026

  భీమవరంలోని ఎస్ఆర్ఆర్‌కేఆర్ కళాశాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు హాళ్లు, భీమవరం డివిజన్‌కు సంబంధించిన రిసెప్షన్ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి స్వీకరణ, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రత, స్ట్రాంగ్ రూమ్‌లలో చేపట్టిన ఏర్పాట్లు, కౌంటింగ్ హాళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు […]

WhatsApp Image 2026-11-04 at 4.55.46 PM

పశ్చిమగోదావరి జిల్లాలో ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వెల్లడించారు.

Published on: 04/11/2026

  బుధవారం భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలకు, 340 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణ కోసం సుమారు 7,500 మంది అధికారులు, […]

WhatsApp Image 2026-11-04 at 5.00.02 PM

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

Published on: 04/11/2026

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి భీమవరంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి పి. గ్లోరియా, […]

WhatsApp Image 2026-11-04 at 8.16.37 PM

పశ్చిమగోదావరిలో యుధ్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ భారీ వర్షంలోనూ అధికారులు, సిబ్బంది నిర్విరామ కృషి ప్రశంసనీయం ఎపిఎస్ పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి

Published on: 04/11/2026

ఆర్నబ్ తుఫాను కారణంగా ఎపిఇపిడిసిఎల్ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. ఆర్నబ్ తుఫాను కారణంగా ఎపిఇపిడిసిఎల్ పరిధిలోని పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరణ పనుల పర్యవేక్షణా బాధ్యతలను ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటికి అప్పగించారు. ఈ సందర్భంగా సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేసే అంశంపై […]

WhatsApp Image 2026-11-03 at 3.35.54 PM

జిల్లాలోని నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీ ల్లో నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 03/11/2026

జిల్లాలోని నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీ ల్లో నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ​ఈ సందర్భంగా మంగళవారం వై.ఎన్ కళాశాల లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన పోలింగ్ జరిగిన మున్సిపాలిటీ, నగర పంచాయతీ ల్లోనూ నిర్ణీత సమయానికి కౌంటింగ్ ప్రారంభమైందని తెలిపారు. ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ చాలా వేగంగా, ప్రశాంత వాతావరణంలో సాగుతోందన్నారు. ఇప్పటివరకు దాదాపు 60 […]

WhatsApp Image 2026-11-03 at 6.32.07 PM

మురసు తుఫాను ప్రభావంతో జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటమునిగిన పలు ప్రాంతాలు, డ్రైనేజీలు, వ్యవసాయ పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు.

Published on: 03/11/2026

మురసు తుఫాను ప్రభావంతో జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటమునిగిన పలు ప్రాంతాలు, డ్రైనేజీలు, వ్యవసాయ పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు. మంగళవారం నరసాపురం, పాలకొల్లు మండలం, వీరవాసరం మండలాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించి వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుని, తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ** నరసాపురంలో భారీ వర్షాలకు నీట మునిగిన రహదారులు, […]