ఏండగండి లాకులను పరిశీలించి, వరద పరిస్థితిపై ప్రజలతో మాట్లాడిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
Publish Date : 06/11/2026
ఉండి మండలం ఏండగండి గ్రామంలో ఉన్న లాకులను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వరద పరిస్థితులు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. వరద నీటి ప్రవాహం, లాకుల పరిస్థితిని నిరంతరం గమనిస్తూ అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ సిబ్బందికి, తహసీల్దార్‌కు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.