ఎస్ఆర్ఆర్‌కేఆర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లు, రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

Publish Date : 05/11/2026
WhatsApp Image 2026-11-05 at 8.11.17 PM

 

భీమవరంలోని ఎస్ఆర్ఆర్‌కేఆర్ కళాశాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు హాళ్లు, భీమవరం డివిజన్‌కు సంబంధించిన రిసెప్షన్ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి స్వీకరణ, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రత, స్ట్రాంగ్ రూమ్‌లలో చేపట్టిన ఏర్పాట్లు, కౌంటింగ్ హాళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లా సమాచార శాఖ, భీమవరం వారిచే జారీ చేయడమైనది…