ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

Publish Date : 04/11/2026
WhatsApp Image 2026-11-04 at 5.00.02 PM

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

బుధవారం అమరావతి సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి భీమవరంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి పి. గ్లోరియా, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రమణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ , ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల సామగ్రిని నిర్దేశించిన మార్గాల్లోనే తరలించాలని, సామగ్రి తరలింపు సమయంలో తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు.