జిల్లాలోని నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీ ల్లో నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 03/11/2026
WhatsApp Image 2026-11-03 at 3.35.54 PM

జిల్లాలోని నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీ
ల్లో నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

​ఈ సందర్భంగా మంగళవారం వై.ఎన్ కళాశాల లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ
ఈ నెల 1వ తేదీన పోలింగ్ జరిగిన మున్సిపాలిటీ, నగర పంచాయతీ ల్లోనూ నిర్ణీత సమయానికి కౌంటింగ్ ప్రారంభమైందని తెలిపారు. ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ చాలా వేగంగా, ప్రశాంత వాతావరణంలో సాగుతోందన్నారు.
ఇప్పటివరకు దాదాపు 60 నుండి 70 శాతం కౌంటింగ్ పూర్తయిందని, సాయంత్రానికి మొత్తం ప్రక్రియ పూర్తయి పూర్తి స్థాయి ఫలితాలను వెల్లదించటం జరుగుతుందన్నారు. వర్షం పడుతున్నప్పటికీ ఎక్కడా ఆలస్యం లేకుండ ఎలక్షన్ అధికారి, పోలీసు సిబ్బంది, ఇతర సిబ్బంది సమన్వయంతో కౌంటింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు.

**​రాబోయే ఎన్నికలకు సర్వసిద్ధం.

రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ (5వ తేదీన) కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
పోలింగ్, పోలీస్ సిబ్బందిని ఇప్పటికే నియామకం, శిక్షణా కార్యక్రమాలు పూర్తయ్యాయన్నారు. రేపటి నుంచి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. 5వ తేదీన పోలింగ్, 7వ తేదీన కౌంటింగ్ కోసం అధికారులందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.