ఉండి మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

Publish Date : 05/11/2026
WhatsApp Image 2026-11-05 at 1.15.40 PM

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని, ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.