Close

Press Release

Filter:

సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Published on: 09/01/2025

గురువారం స్థానిక కలెక్టరేట్ జిల్లా ఖజానా కార్యాలయం నందు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటుచేసిన బొమ్మల కొలువును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జ్యోతిని వెలిగించి ప్రారంభించి, ఖజానా కార్యాలయ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి సంబరాలు సాంప్రదాయం ఉట్టిపడేలా వేడుకగా జిల్లా ట్రెజరీ అధికారి ఆడారి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించడాన్ని ప్రశంశించారు. కోలం ముగ్గులను, బొమ్మల కొలువును అలంకరణలను పరిశీలించి చాలా బాగుందని కితాబ్ ఇచ్చి, ఈ అలంకరణలో పాల్గొన్న మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ […]

More

విద్యార్థులు భవిష్యత్ మార్గ నిర్దేశకులు అని, పాఠశాల విద్య నుండే ఉన్నతంగా చదివి మంచి భవిష్యత్తుకు ఏర్పరచుకోవాలని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

Published on: 06/01/2025

రాజకీయాలకు అతీతంగా విద్యాభివృద్ధే మా లక్ష్యం అందుకే స్పూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు! చాగంటి సలహాలతో నైతిక విలువలపై పాఠ్యాంశాలు ఉండి అభివృద్ధికి రఘురామ చేస్తున్న కృషి భేష్ టాటా సేవలకు గుర్తుగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉండి నియోజకవర్గంలో మంత్రి లోకేష్ సుడిగాలి పర్యటన…… సోమవారం ఉండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. ఈ సంధర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విద్యను రాజకీయాలకు అతీతంగా ఉంచేందుకే విద్యార్థులకు […]

More

పిల్లల జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సైన్స్ ఫెయిర్ వంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మరియు భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అన్నారు.

Published on: 06/01/2025

శనివారం వీరవాసరం ఎం ఆర్ కె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మరియు భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు సభా అధ్యక్షులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యులు బొర్రా గోపి మూర్తి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ […]

More

జనవరి 6న ఉండి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రానున్న రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 06/01/2025

జనవరి 6వ తేదీన గన్నవరం విమానాశ్రయం నుండి ఉదయం 8:40 గం.లకు రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 10:30 గం.లకు ఉండి జడ్పీ హైస్కూల్ కు చేరుకుంటారు. అధునాకరించిన108 సంవత్సరాల హై స్కూల్ భవనాన్ని, క్రీడా సౌకర్యాలను ప్రారంభిస్తారు. అనంతరం ఉ.11.00 గం.లకు ఉండి హై స్కూల్ నుంచి బయలుదేరి పెద్ద అమిరం భీమవరం ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటుచేసిన రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ప్రారంభించి, అనంతరం రతన్ టాటా మార్గ్ గా నామకరణ చేసిన […]

More

జిల్లాలో ఎస్సీ కుల గణనపై జాబితా ప్రకటనకు జనవరి 17 వరకు పొడిగించడం జరిగిందని, జనవరి 7 వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని జరుగుతోందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Published on: 06/01/2025

ఎస్సి జనాభా, వారి వివరాలు.. పేరు, ఆధార్ నంబరు, పుట్టిన తేదీ, వయసు, ఉపకులం, మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి సౌకర్యం, విద్యార్హత, వృత్తి, వ్యవసాయం, ఇతర వివరాల పై సోషల్ ఆడిట్ నిర్వహించడం జరుగుచున్నదని తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటిలలోని గ్రామ, వార్డు సచివాలయములలో నోటీసు బోర్డు నందు షెడ్యూల్ కులాల వారి జాబితాను డిసెంబర్ 26వ తేదీన ప్రకటించడం జరిగిందన్నారు. తదుపరి మార్పులు, చేర్పులకు అభ్యంతరాలను జనవరి 7 వరకు వరకు దరఖాస్తులను స్వీకరించడం […]

More

రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లను లోటుపాట్లకు తావు లేనివిధంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 06/01/2025

శనివారం భీమవరం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి విద్య, వైద్య, పోలీస్, పంచాయతీ, ఫైర్, ఆర్ అండ్ బి, రెవిన్యూ, తదితర శాఖల అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. అన్ని ఏర్పాట్లను ఐదో తేదీ ఆదివారం […]

More

బియ్యం సేకరణ వేగవంతంగా జరగాలని సంబంధిత శాఖల అధికారులును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

Published on: 06/01/2025

శనివారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలోని ఉన్న 14 గిడ్డంగులు యజమానులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైస్ మిల్లులో మరఆడిన బియ్యాన్ని త్వరితగతిన దిగుమతి అయ్యేలా తగిన హమాలీలను సమకూర్చుకొని బియ్యం దిగుమతి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. గిడ్డంగుల నిర్వహణలో ఏటువంటి అవకతవకలు లేకుండా సమగ్రంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇతర జిల్లాలకు పంపవలసిన బియ్యాన్ని […]

More

జిల్లాలో జనవరి 6 నుండి మంచానికి, వీల్ చైర్ కి పరిమితమైన పింఛనుదారుల తనిఖీలను చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 06/01/2025

జిల్లాలో 1,510 మంది పెన్షనర్లు రూ.15,000/- లు చొప్పున పింఛన్ ను అందుకుంటున్నారని, వీరందరూ మంచానికే పరిమితమై లేదా విల్ చైర్ క్యాటగిరిలో పింఛన్లు పొందడం జరుగుతుందని, ఇటువంటి వారిని వారి ఇంటి వద్దనే షెడ్యూల్ ప్రకారం జనవరి 6 నుండి జనవరి 31 వరకు వెరిఫికేషన్ చెయ్యండి జరుగుతుందని తెలిపారు. వీరికి ఎంపీడీఓలు, మునిసిపల్ కమీషనర్ ల కార్యాలయాల నుండి ముందుగా ఇంటిమేషన్ లెటర్స ను అందజేయడం జరుగుతుందన్నారు. పింఛన్ల తనిఖీ నిమిత్తం జిల్లాలో డివిజన్ […]

More
2

జిల్లాలో ఎన్ హెచ్-165 కి సంబంధించిన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 04/01/2025

జిల్లాలో ఎన్ హెచ్-165 కి సంబంధించిన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన పామర్రు-దిగమర్రు నేషనల్ హైవే-165 భూ సేకరణలో భాగంగా ఆరు కిలోమీటర్ల పరిధిలో ఆకివీడు మండలంలోని ఆకివీడు, దుంపగడప, అజ్జమూరు గ్రామాలకు చెందిన భూములకు సంబంధించి భూసేకరణ అధికారి మరియు భీమవరం ఆర్డీవో తయారుచేసిన అవార్డులపై నేషనల్ […]

More

మండలాలలో ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై జనవరి 6న గ్రామ సభలను నిర్వహించనున్నట్లు ఎకో సెన్సిటివ్ జోన్ జిల్లా మానిటరింగ్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 04/01/2025

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాలలో ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై జనవరి 6న గ్రామ సభలను నిర్వహించనున్నట్లు ఎకో సెన్సిటివ్ జోన్ జిల్లా మానిటరింగ్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కొల్లేరు అభయారణ్యం చుట్టు ప్రక్కల ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారు చేయడంపై ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాలలోని తహసిల్దార్ కార్యాలయాల వద్ద జనవరి 6వ తేదీన గ్రామ సభలను నిర్వహించి అవగాహన కల్పించడంతోపాటు ప్రజల […]

More