Press Release
జిల్లాలోని నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీ ల్లో నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 03/11/2026జిల్లాలోని నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీ ల్లో నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం వై.ఎన్ కళాశాల లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన పోలింగ్ జరిగిన మున్సిపాలిటీ, నగర పంచాయతీ ల్లోనూ నిర్ణీత సమయానికి కౌంటింగ్ ప్రారంభమైందని తెలిపారు. ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ చాలా వేగంగా, ప్రశాంత వాతావరణంలో సాగుతోందన్నారు. ఇప్పటివరకు దాదాపు 60 […]
మురసు తుఫాను ప్రభావంతో జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటమునిగిన పలు ప్రాంతాలు, డ్రైనేజీలు, వ్యవసాయ పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు.
Published on: 03/11/2026మురసు తుఫాను ప్రభావంతో జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటమునిగిన పలు ప్రాంతాలు, డ్రైనేజీలు, వ్యవసాయ పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు. మంగళవారం నరసాపురం, పాలకొల్లు మండలం, వీరవాసరం మండలాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించి వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుని, తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ** నరసాపురంలో భారీ వర్షాలకు నీట మునిగిన రహదారులు, […]
జిల్లాలో తుపాను కారణంగా వర్షాలు కురుస్తున్న దృష్ట్యా మరియు జిల్లాలో జెడ్పీ.టి.సీ, ఎం.పి.టి.సి ఎన్నిక లుజరుగు తున్నందు న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల లు, ప్రైవేట్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల కు ఈనెల4వ తేదీ బుధవారంశలవు
Published on: 03/11/2026జిల్లాలో తుపాను కారణంగా వర్షాలు కురుస్తున్న దృష్ట్యా మరియు జిల్లాలో జెడ్పీ.టి.సీ, ఎం.పి.టి.సి ఎన్నిక లుజరుగు తున్నందు న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల లు, ప్రైవేట్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల కు ఈనెల4వ తేదీ బుధవారంశలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నేడు ప్రకటనలో తెలిపారు.జిల్లాలోజెడ్పీ. టి.సి, ఎం.పి.టి.సీ ఎన్నికలు జరుగుచున్నoదున 5వ తేదీ గురువారంప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లుకలెక్టర్ తెలిపారు. తుపాను ప్రభావం మరియు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని […]
అర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ, సహాయక చర్యలను వేగవంతం చేయాలి.అత్యవసర మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలి….
Published on: 02/11/2026సోమవారం కలెక్టరేట్‌లోని వశిష్ట సమావేశ మందిరంలో పశ్చిమగోదావరి జిల్లా తుఫాను సహాయక చర్యల ప్రత్యేక అధికారి ఎం.ఎం. నాయక్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయక, పునరుద్ధరణ చర్యలు, ప్రజలకు అందిస్తున్న అత్యవసర సేవలు, పంట నష్టాల అంచనాలపై సమీక్షించారు. అర్నబ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో త్రాగునీరు, విద్యుత్, పారిశుధ్యం తదితర అత్యవసర […]
నరసాపురం పురపాలక సంఘం పరిధిలో పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 01/11/2026నరసాపురం పురపాలక సంఘం పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆదివారం నిర్వహిస్తున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. ఈ సందర్భంగా కస్తూరిబా గాంధీ ఉన్నత పాఠశాల, పురపాలక సంఘo ప్రాథమిక పాఠశాల తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ, పోలింగ్ ప్రక్రియ నిర్వహణ తీరును ఆమె పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు […]
తుఫాన్ నష్టాలపై కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తాం.కేంద్ర బృందం సభ్యులు కొల్లు రేఖా రాణి, జలవనరుల మంత్రిత్వ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్. ** పశ్చిమగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించిన అంతర్‌మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం. క్షేత్రస్థాయిలో పంటలు, మత్స
Published on: 01/11/2026తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వ్యవసాయ, ఆక్వా, విద్యుత్, ఉద్యాన పంటలు ను ఆదివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, కేంద్ర బృందం, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించి, రైతలతో మాట్లాడారు. పంట నష్టాలను శాస్త్రీయంగా అంచనా వేయడంతో పాటు, ఉపగ్రహ చిత్రాలు, రిమోట్ సెన్సింగ్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బృందం తెలిపింది. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో హైదరాబాద్‌కు చెందిన రెఖారాణి కొల్లు, జలవనరుల మంత్రిత్వ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్, సిడబ్ల్యుసి తో కలిసి నలుగురు […]
శాంతంగా ముగిసిన నరసాపురం పురపాలక సంఘం, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు నరసాపురం మున్సిపాలిటీ 71.37 శాతం ,ఆకివీడు నగర పంచాయతీ 74.47 శాతంపోలింగ్ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 01/11/2026జిల్లాలో నరసాపురం పురపాలక సంఘం, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా ముగిశాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నరసాపురం పురపాలక సంఘం, ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు […]
జిల్లా కలెక్టర్ నాయకత్వంలో జిల్లా యంత్రాంగం చేపట్టిన సహాయక, పునరుద్ధరణ చర్యలపై కేంద్ర బృందం ప్రశంసలు… అర్నబ్ తుఫాను నష్టాల అంచనాకు పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన తుఫాను నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేంద్ర బృందం
Published on: 01/11/2026అర్నబ్ తుఫాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్యశాఖ, రహదారులు, భవనాలు, నీటిపారుదల, విద్యుత్, గృహ నిర్మాణం తదితర రంగాల్లో జరిగిన నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేయడానికి కేంద్ర బృందం ఆదివారం జిల్లాలో పర్యటించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ అలోక్ జవహర్, నాయకత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి వివిధ రంగాలకు జరిగిన నష్టాలను పరిశీలించింది. ఆదివారం భీమవరం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జిల్లా […]
జిల్లాలో నవంబర్ 1న నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 31/10/2026జిల్లాలోని నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 2026 నవంబర్ 1వ తేదీ ఆదివారం పోలింగ్ ఆయా మున్సిపాలిటీలు పరిధిలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలందరూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, పట్టణాల అభివృద్ధికి, సమర్థవంతమైన స్థానిక పాలనకు సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రతి ఓటరు […]
విద్యుత్ సబ్‌స్టేషన్ పరిశీలించి, తుఫాను బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 31/10/2026ఆర్నాబ్ తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా నరసాపురం పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి, విద్యుత్ పునరుద్ధరణకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు. అనంతరం మండలంలోని సరిపల్లె గ్రామంలో తుఫాను ప్రభావానికి గురైన బాధితులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌లో అందుబాటులో ఉంచిన విద్యుత్ సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లను త్వరితగతిన పునరుద్ధరించేందుకు […]