తుఫాన్ నష్టాలపై కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తాం.కేంద్ర బృందం సభ్యులు కొల్లు రేఖా రాణి, జలవనరుల మంత్రిత్వ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్. ​** పశ్చిమగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించిన అంతర్‌మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం. క్షేత్రస్థాయిలో పంటలు, మత్స

Publish Date : 01/11/2026
01_11_1

తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వ్యవసాయ,
ఆక్వా, విద్యుత్, ఉద్యాన పంటలు ను ఆదివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, కేంద్ర బృందం, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించి, రైతలతో మాట్లాడారు.

పంట నష్టాలను శాస్త్రీయంగా అంచనా వేయడంతో పాటు, ఉపగ్రహ చిత్రాలు, రిమోట్ సెన్సింగ్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బృందం తెలిపింది.

ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో హైదరాబాద్‌కు చెందిన రెఖారాణి కొల్లు,
జలవనరుల మంత్రిత్వ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్, సిడబ్ల్యుసి తో కలిసి నలుగురు సభ్యులతో అంతర్ మంత్రిత్వ శాఖల సమన్వయ కేంద్ర బృందం ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించింది.

కేంద్ర జల సంఘం (సి డబ్ల్యూసి)
సూపరింటెండింగ్ ఇంజనీర్, కృష్ణా & కోఆర్డ్ సర్కిల్, కేజీబీవో ​హైదరాబాద్‌కు చెందిన రెఖారాణి కొల్లు, ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.వి.ఎస్.పి శర్మ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ అలోక్ జవహర్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఎస్.కె రాకేష్ కుమార్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీరితోపాటు ఏపీ సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి కేంద్ర బృందం వెంట వున్నారు.

​
**క్షేత్ర స్థాయి పర్యటన లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వ్యవసాయ, ఉద్యాన పంటలైన కొబ్బరి, అరటి తోటలకు సంభవించిన నష్టాలు, ఆక్యా, తీర ప్రాంత గ్రామాలు, నివాస గృహాలు, మత్స్యకార బోట్లు, విద్యుత్ స్తంభాలు, వైర్ల ధ్వంసం వంటి వివరాలను కేంద్ర ప్రతినిధులకు సమగ్రంగా వివరించారు.

​క్షేత్రస్థాయి తనిఖీలు:

ఆచంట నియోజకవర్గం, పెనుగొండ మండలం, వడలి గ్రామంలో ఈదురు గాలులు, భారీ వర్షాలకు నేలకొరిగిన వరిచేలను, ధ్వంసమైన అరటి పంటలను కేంద్ర బృందం ప్రత్యక్షంగా పరిశీలించింది.
కేంద్ర బృందం ప్రతినిధులు నేరుగా రైతులతో సంభాషించి కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రతినిధులు రైతులతో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టటం జరిగిందని, కేంద్రనికి వాస్తవాలను నివేదిస్తామన్నారు.

​ పాలకొల్లు నియోజకవర్గం లో
పాలకొల్లు పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో తుఫాను ఈదురు గాలులకు విరిగిన చెట్లు, విద్యుత్ స్తంబాలు, తెగిపడిన వైర్లు పరిశీలించారు. తుఫాను ప్రభావం పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. విద్యుత్ పునరుద్ధరణకరణకు 2000 మంది సిబ్బంది ఆర్మీ సెలవు నిర్మిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం నుంచి అదనపు సిబ్బంది రప్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కేంద్ర బృందానికి వివరించారు.

యలమంచిలో విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ సామాగ్రి, సిబ్బంది నిర్వహిస్తున్న విద్యుత్ పునరుద్దారీకరణ పనులను కేంద్ర బృందం పరిశీలించింది.

ఎలమంచిలి మండలం, ఆర్య పేట లో తుఫాన్ తాకిడికి విరిగిపడిన రావి చెట్టు మహా వృక్షాన్ని, ధ్వంసమైన భవనాన్ని తనిఖీ చేసి బాధితులు దొంగ శ్రీనివాస్, పిల్లి వెంకటేశ్వరరావు, పద్మ లను కేంద్ర బృందం పరామర్శించింది.

పాలకొల్లు – నరసాపురం మార్గంలో రహదారి వెంట తుఫాను తాకిడికి పడివున్న వృక్షాలను స్వయంగా పరిశీలించారు.

పాలకొల్లు మండలం, దిగమర్రు గ్రామం, చెంచినాడ రోడ్డు లో దెబ్బతిన్న రొయ్యల చెరువులను, ఏరియేటర్లు, ఫీడ్ షెడ్డు లను పరిశీలించి ఆక్వా రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు

నరసాపురం నియోజకవర్గం లో
నరసాపురం సెంటర్ లో ధ్వంసమైన విద్యుత్ టవర్ ను పరిశీలించారు.

నరసాపురం మండలం లిఖితపూడి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పై విరిగిపడిన వృక్షాన్ని, జరిగిన నష్టాన్ని పరిశీలించారు.

నరసాపురం మండలం, బియ్యపుతిప్ప లో తుఫాను వలన ధ్వంసమైన మత్స్య కారుల బోట్ల ను పరిశీలించి, మత్స్యకారులతో మాట్లాడారు.

నరసాపురం మండలం, రామన్నపాలెం లో నీటమునిగిన పంట పొలాలు, కొబ్బరి చెట్లు పరిశీలించి రైతులను పంట నష్టం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మొగల్తూరు మండలం, కేపీ పాలెం నార్త్, మెట్రేవ్ గ్రామంలో తుఫాను బాధితుకు ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని కేంద్ర బృందం సందర్శించి, బాధితులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

**​రైతులు, బాధితులతో ముఖాముఖి

క్షేత్ర పర్యటనలో భాగంగా బృందం సభ్యులు నేరుగా రైతుల వద్దకు వెళ్ళి పంట నష్టాల తీవ్రతను, ఆక్వా రైతులు ను కలిసి వారికి జరిగిన నష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం, పునరావాస చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన బాధితుల వివరాలను కలెక్టర్ బృందానికి వివరించారు.

**​కేంద్ర బృందం స్పందన:

​ పశ్చిమగోదావరి జిల్లాలో వరి పంటలు, ఉద్యాన పంటలు, ఆక్వా రంగానికి జరిగిన నష్టం తమను తీవ్రంగా చలింపజేసిందని కేంద్ర బృందం పేర్కొంది. తుఫాన్ వల్ల జరిగిన వాస్తవ నష్టాన్ని గుర్తిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి సమగ్ర నివేదికను అందజేస్తామని తెలిపారు.

​ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీ సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ,, నరసాపురం ఆర్డీవో కే దాసరాజు, పెనుగొండ ఎమ్మార్వో అనిత కుమారి, ఎండిఓ టీఎస్ మూర్తి, పాలకొల్లు ఎమ్మార్వో, పాలకొల్లు మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.