Press Release
పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 31/10/2026పశ్చిమగోదావరి జిల్లాలో అర్నబ్ తుఫాను ప్రభావం దృష్ట్యా వ్యవసాయం, ఉద్యానవనం, మత్యశాఖ, రోడ్డు భవనాలు, నీటిపారుదల, విద్యుత్, గృహ నిర్మాణం ఇతర మౌలిక సదుపాయాలతో సహా వివిధ రంగాలలో వాటిలిన నష్టాలను అంచనావేయడానికి ఇంటర్ మినిస్ట్రియల్ సెంటర్ టీం ఆదివారం జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఎన్.వి సతీష్ సీమకుమారి, డైరెక్టర్ జలవనరుల మంత్రిత్వ శాఖ సిడబ్ల్యుసి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో ఈ బృందం పెనుగొండ, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటన […]
నరసాపురం పట్టణంలోని పోలింగ్ కేంద్రాలకు విద్యుత్ పునరుద్ధరణ పూర్తి. ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేసిన దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ. యుద్ధ ప్రాతిపదికన సమన్వయంతో పనిచేసిన విద్యుత్ శాఖ, ఇతర శాఖల సిబ్బంది. జిల్లా కలెక్టర్ చదలవాడ
Published on: 31/10/2026నరసాపురం పట్టణంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధం చేసిన పోలింగ్ కేంద్రాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం నరసాపురం పట్టణంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల ఏర్పడిన తుఫాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ప్రజలకు, ఎన్నికల నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ పునరుద్ధరణ చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. నరసాపురం పురపాలక సంఘం పరిధిలో పట్టణ […]
జిల్లా కలెక్టర్ ఆదేశాను సారం జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రవిబాబు కలెక్టరేట్ లోని DMHO ఆఫీసులో అయోడిన్ లోపం అవగాహన కార్యక్రమా నికి సంబంధించిన గోడకు కర పత్రాలను శనివారం ఆవిష్కరించడం జరిగినది
Published on: 31/10/2026DMHO డాక్టర్ రవి బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అయోడిన్ తో కలిగిన ఉప్పును మాత్రమే వాడాలి అని లేకపోతే థైరాయిడ్, బుద్ధి మాన్యం, ఇతర సమస్యలు రావచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ సి డి ప్రోగ్రాం అధికారి డాక్టర్ కె రత్న కిషోర్ మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం ని ప్రతి పీహెచ్సీ లోను నిర్వహించి ప్రతి స్కూల్లో విద్యార్థులకు అయోడిన్ ఉప్పుపై అవగాహన కల్పించి వారికి దీనిపై వ్యాసరచన మరియు క్విజ్ పోటీలను […]
మొగల్తూరు మండలం మాట్రేవు గ్రామంలోని తుఫాను షెల్టర్ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
Published on: 30/10/2026మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ • క్షేత్రస్థాయిలో అర్నబ్ తుఫాను ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూశాను. • ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నాం. • పలుమార్లు క్షేత్రస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్సులో మాట్లాడుతూ నిరంతరం అప్రమత్తం చేశాం • తుఫాను ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి నష్ట తీవ్రతను బేరీజు వేసి ప్రజలను అప్రమత్తం చేశాం • రాత్రంతా మేల్కొని మరీ తుఫాను హెచ్చరికలను జారీ చేసేలా సమీక్షలు నిర్వహించాం • తుఫాను కారణంగా […]
ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 30/10/2026ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా, ప్రతి నెలా పింఛన్లు సకాలంలో సిబ్బంది […]
అర్నబ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన రైతులకు జరిగిన పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 29/10/2026అర్నబ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన రైతులకు జరిగిన పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. **అర్నబ్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగి దెబ్బతిన్న పంట పొలాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి […]
అర్నబ్ తుపాను నష్టాలపై ప్రతి రెండు గంటలకు సమగ్ర నివేదిక అందించాలి.కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ ఆదేశాలు
Published on: 29/10/2026అర్నబ్ తుపాను నష్టాలపై ప్రతి రెండు గంటలకు సమగ్ర నివేదిక అందించాలి…. కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ ఆదేశాలు అర్నబ్ తుపాను కారణంగా జిల్లాలో జరిగిన నష్టాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, సహాయక, పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేసేందుకు ప్రతి రెండు గంటలకు సమగ్ర నివేదికలు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కమాండ్ […]
*తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు. విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 29/10/2026తుఫాన్ ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితులు, పునరుద్ధరణ చర్యలపై మంత్రి, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ తో కలిసి నరసాపురంలో సంబంధిత అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బందితో సమీక్షిస్తూ, […]
వీరవాసరం మండలంలో తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
Published on: 29/10/2026వీరవాసరం మండలంలో తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అర్నబ్ తుపాను ప్రభావంతో వీరవాసరం మండలంలో దెబ్బతిన్న వ్యవసాయ పంటలను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించి, ప్రభావిత ప్రాంతాల్లో పంటల పరిస్థితిని, నష్టం తీవ్రతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తుపాను ప్రభావంతో పంట నష్టానికి గురైన రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, […]
జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తణుకు నియోజకవర్గం దువ్వ, ముద్దాపురం గ్రామాల్లో అర్నబ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి,
Published on: 29/10/2026జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తణుకు నియోజకవర్గం దువ్వ, ముద్దాపురం గ్రామాల్లో అర్నబ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తో కలిసి పరిశీలించారు. తుపాను ప్రభావం వలన కురిసిన అధిక వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి, ప్రభావిత ప్రాంతాల్లో పంటల పరిస్థితిని, నష్టం తీవ్రతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన […]