శాంతంగా ముగిసిన నరసాపురం పురపాలక సంఘం, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు నరసాపురం మున్సిపాలిటీ 71.37 శాతం ,ఆకివీడు నగర పంచాయతీ 74.47 శాతంపోలింగ్ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 01/11/2026
01_11

జిల్లాలో నరసాపురం పురపాలక సంఘం, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా ముగిశాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
ఆదివారం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నరసాపురం పురపాలక సంఘం, ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించారని తెలిపారు.
నరసాపురం పురపాలక సంఘం పరిధిలో 36 వార్డులకు గాను పురుషు ఓటర్లు 22,389 మహిళా ఓటర్లు 24,606, మొత్తం ఓటర్లు 46,996 కాగా మొత్తం పోలైన ఓట్లు 33,543, ఇతరులు 0 పోలింగ్ శాతం71.37 , తమ ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పురుషులు 16,005, మహిళలు 17,538 ఉన్నారు.
***ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో 28 వార్డులకు గాను 25, 435 ఓట్లు ఉండగా పురుషులు 12,617 మంది కాగా మహిళలు 13,817 ఇతరులు 1 ఉండగా
19,686 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళా ఓటర్లు 10,237, పురుషులు 9,449 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం పోలింగ్ శాతం 74.47 శాతంగా నమోదైనట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నవంబరు 3వ తేదీ మంగళవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. నరసాపురం పురపాలక సంఘానికి సంబంధించి నరసాపురం వై.ఎన్ కళాశాలలో, ఆకివీడు నగర పంచాయతీకి సంబంధించి ఆకివీడు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు.