నరసాపురం పురపాలక సంఘం పరిధిలో పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 01/11/2026
WhatsApp Image 2026-11-01 at 3.08.45 PM

నరసాపురం పురపాలక సంఘం పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆదివారం నిర్వహిస్తున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. ఈ సందర్భంగా కస్తూరిబా గాంధీ ఉన్నత పాఠశాల, పురపాలక సంఘo ప్రాథమిక పాఠశాల తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.

పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ, పోలింగ్ ప్రక్రియ నిర్వహణ తీరును ఆమె పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేస్తూ పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.