Close

Press Release

Filter by:

భీమవరంలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ నందు ఫిబ్రవరి 27న నిర్వహించే మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 24/02/2026

కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థచే భీమవరం శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ నందు ఈ నెల 27వ తారీఖున మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ లో సుమారు 21 ప్రముఖ […]

More

ప్రభుత్వ ఆసుపత్రులలో అందించే వైద్య సేవలపై సంతృప్తిస్థాయి పెరిగే విధంగా వైద్యాధికారులు, డాక్టర్లు మెరుగైన సేవలందించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 24/02/2026

ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీల ప్రసవాలు తగ్గడంపై వైద్యాధికారులు, డాక్టర్లపై కలెక్టర్ ఆగ్రహం ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సిబ్బంది రోగుల నుండి సొమ్ము డిమాండ్ చేస్తే కఠిన చర్యలు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాలలో నూరు శాతం లక్ష్యసాధనకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలి. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల మెడికల్ అధికారులు, ఏరియా ఆసుపత్రుల వైద్యాధికారులు, సూపరింటెండెంట్స్, పిహెచ్సి […]

More

ప్రయోగాలు చేసేందుకు విద్యార్థులను ఉపాధ్యాయులు నిరంతరాయంగా ప్రోత్సహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 23/02/2026

నేటి చిన్న, చిన్న ప్రయోగాలే రేపటి విజయానికి బాటలు వేస్తాయి.. నూతన ఆవిష్కరణలకు నిరంతరాయంగా ప్రయోగాలు జరగాలి. ఉండి మండలం మహాదేవపట్నం గాదిరాజు అప్పల నరసింహరాజు జిల్లా పరిషత్ పాఠశాల నందు నిర్వహించిన “సైన్స్ సమగ్ర మహోత్సవ్ -2026” కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులు తయారుచేసిన వివిధ ప్రాజెక్టులను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమగ్ర శిక్ష మరియు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ కలిసి సోమవారం […]

More

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

Published on: 23/02/2026

అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలి. నేడు పి జి ఆర్ ఎస్ లో 204 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ లో 41 దరఖాస్తులు స్వీకరణ. .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. జిల్లా కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ బి.శివన్నారాయణ రెడ్డి, […]

More

నిబంధనల ప్రకారం విద్యార్థులను సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసి తరువాతే లోపలికి అనుమతి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 23/02/2026

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలు ఆకస్మిక తనిఖీ ఎటువంటి మాస్ కాపీ జరగడానికి వీల్లేదు ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిఘా ఉంచాలి అధికారులు ఆదేశాలు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు భీమవరం మెంటే వారి జి వి ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్, బ్రౌనింగ్ జూనియర్ కాలేజీలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను సోమవారం […]

More

జిల్లాలో రేపటి నుంచి (సోమవారం) ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Published on: 22/02/2026

రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షలు – జిల్లాలో మొత్తం 53 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ప్రధమ, ద్వితీయ ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్న 37,550 మంది అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైతే పరీక్షా కేంద్రంలోకి అనుమతి నిరాకరణ పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్ నిషేధం పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ తో ప్రత్యేక నిఘా … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో సోమవారం నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షలకు […]

More

జిల్లాకు కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను నూరు శాతం వినియోగించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 21/02/2026

భీమవరం కలెక్టరేట్ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం సర్వే, వైద్య, వ్యవసాయ, విద్య, పంచాయతీరాజ్, ఐ సి డి ఎస్, ఉద్యానవన శాఖల అధికారులతో సమావేశమై కేంద్రం జిల్లాకు కేటాయించిన ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై సమీక్షించారు. తొలుత ఏ ఏ శాఖలలో ఏ ఏ పథకాల కింద ఎంత నిధులు మంజూరయ్యాయి, వాటిని ఎంతవరకు ఖర్చు చేశారు, ఇంకా ఎంత ఖర్చు చేయాలి, ఏ ఏ పనులు ప్రోగ్రెస్ లో ఉన్నవి […]

More

విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేగిరాజు శివ వర్మ చేస్తున్న ప్రాతళ్ళమెరక అభివృద్ధి అభినందనీయమని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు కొనియాడారు.

Published on: 21/02/2026

విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ 30వ వార్షిక వేడుకలు సందర్భంగా నిర్వహిస్తున్న అభివృద్ధి పథంలో ప్రాతళ్ళమెరక కార్యక్రమంలో భాగంగా సుమారు ఒక కోటి రూపాయల వ్యయంతో సిసి రోడ్లు నిర్మాణం చేసిన మంచినీటి చెరువు, మైక్రో ఫిల్టర్, మంచినీటి పైపులైను, సీసీ కెమెరా సిస్టం ఏర్పాటును, సుమారు రూ.1.25 కోట్ల వ్యయంతో గ్రామ మురుగునీటిపారుదల కోసం చేసిన డ్రైనేజ్ సిస్టంను, సుమారు రూ.50 లక్షల వ్యయంతో చినపేట మంచినీటి చెరువు సంరక్షణ కొరకు కట్టిన వాల్, వాకింగ్ ట్రాక్, […]

More

పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, చెత్త నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Published on: 21/02/2026

స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడవ శనివారం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఆకివీడు మండలం దుంపగడప గ్రామం నందు స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. తొలుత స్వచ్ఛ రథాన్ని ఉపసభాపతి, జిల్లా కలెక్టర్ సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. గృహాలలో పనికిరాని ప్లాస్టిక్, ఇనప వస్తువులు, పుస్తకాలు, పేపర్లు, తదితర వస్తువులను ఈ వాహనం ద్వారా అమ్మితే వాటి విలువకు […]

More

జనాభా లెక్కల సేకరణ-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో వెల్లడి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 20/02/2026

తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ డిజిటల్ విధానంలో …. అందుకు అనుగుణంగా రూపొందించిన మొబైల్ అప్లికేషన్, వెబ్ పోర్టల్ … ఖచ్చితమైన వివరాలతో కూడిన జనాభా లెక్కల సేకరణకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేస్తాం… జనాభా లెక్కల సేకరణ-2027పై ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులు అయిన జిల్లా కలెక్టర్లతో రాష్ట్రస్థాయి సమావేశం శుక్రవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ప్రత్యేక […]

More