భీమవరం, జిల్లాలో ఆర్నబ్ తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న బాధితులకు నిత్యా వసర సరుకులు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నా మని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
భీమవరం, జిల్లాలో ఆర్నబ్ తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న బాధితులకు నిత్యా వసర సరుకులు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నా మని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం మొగల్తూరు మండలం ముత్యాల పల్లి గ్రామంలో ఆర్నాబ్ తుఫాను ప్రభావము వల్ల దెబ్బతిన్న బాధితుల కు జిల్లా కలెక్టర్ నిత్యవసర సరుకు లుపంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆర్నబ్ తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న బాధితులకు 5లక్షల63వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. తుఫాను వల్ల దెబ్బతిన్న బాధితులకు 50 కేజీలు బియ్యం, ఒక కేజీ పంచదార, ఒక లీటర్ పామాయిల్, ఒక కేజీ కందిపప్పు, ఒక కేజీ ఉల్లిపాయ లు, ఒక కేజీ బంగాళ దుంప అన్ని కలిపి ఒకే సంచిలో అందిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ ,జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి సరోజిని, తహసిల్దార్ ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.——- జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి భీమవరం వారి కార్యాలయం నుండి జారీ చేయడమైనది.