ఉచిత కృత్రిమ చేతుల అమరిక క్యాంపును అర్హులైన విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 01/06/2026జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు మెగా కృత్రిమ చేతుల అమరిక శిబిరం సమాచారం గోడపత్రికను సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు, వారి స్వావలంబన పెంపుకు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ ఇంటర్నేషనల్ మరియు ఎల్‌ఎన్-4 హ్యాండ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 2, 2026న గుంటూరులో మెగాకృత్రిమ చేతుల అమరిక శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ […]
Moreప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలి.
Published on: 01/06/2026పీజీఆర్‌ఎస్‌లో 156 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్‌లో 38 దరఖాస్తులు స్వీకరణ. … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. జిల్లా కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి ఎ.వెంకటలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వెంకటేశ్వరరావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు […]
Moreజిల్లాలో జూన్ 1న 2,21,359 మంది లబ్ధిదారులకు రూ.96.77 కోట్ల సామాజిక పింఛన్ల పంపిణీ–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 31/05/2026పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రతను మరింత బలోపేతంచేసే దిశగా జూన్ 1వ తేదీన విస్తృత స్థాయిలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కింద జిల్లావ్యాప్తంగా 25 రకాల పింఛన్లకు సంబంధించి మొత్తం 2,21,359 మంది లబ్ధిదారులకు రూ.96,77,38,500 విలువైన పింఛన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వెల్లడించారు. ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా పింఛన్లను […]
Moreమహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం, దేశం సుభిక్షంగా ఉంటుంది.
Published on: 08/03/2026మహిళా ఆరోగ్యమే కుటుంబ జీవనాధారం భారతీయ సంస్కృతిలో స్త్రీలను దేవతామూర్తులుగా స్థానం కల్పించి గౌరవించారు. నేడు మహిళలు అన్ని రంగాలలో విశేషమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. …రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియం నందు ఆదివారం జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు ముఖ్యఅతిథిగా […]
Moreస్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం, దేశం ఆరోగ్యవంతంగా ఉంటుంది
Published on: 07/03/2026కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం మహిళలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, 9 నుండి 14 సంవత్సరాల వయస్సు గల ప్రతి బాలికకు హెచ్‌పివి (HPV) వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. కాళ్ళ మండలం పెదఅమిరం వెస్ట్ బెర్రీ ఉన్నత పాఠశాలలో శనివారం […]
Moreఎన్టీఆర్ వైద్య సేవ కింద పేదవారికి మెరుగైన చికిత్సలను అందించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 07/03/2026కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం లో శనివారం ఎన్టీఆర్ వైద్య సేవ ఫిర్యాదులపై డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతున్న వైద్య సేవలు, రోగుల నుండి వచ్చిన ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలపై రోగుల నుండి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించడం జరిగిందని, ప్రస్తుతం రోగుల నుండి కొత్తగా ఎటువంటి […]
Moreదీపం–2 పథకంలో నాలుగో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు జమ కాని లబ్ధిదారుల సాంకేతిక సమస్యను క్షేత్రస్థాయిలో పరిష్కరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 07/03/2026పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలో శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి దీపం–2 పథకంలో నాలుగో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు జమ కాని లబ్ధిదారుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగో విడత సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమకావడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గొల్లలకోడేరు గ్రామంలోని పోస్టాఫీసుకు స్వయంగా వెళ్లి ఒక లబ్ధిదారుడి ఆధార్ […]
Moreఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 07/03/2026భీమవరం పీపీ రోడ్డులోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్ లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం సాధారణ తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భధ్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిష్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో ప్రతి మూడు నెలలకి […]
Moreజిల్లా స్థాయి మహిళా దినోత్సవ వేడుకలకు పక్కా ఏర్పాట్లు చేయాలి
Published on: 07/03/2026మార్చి 8న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి అమరావతి నుండి ముఖ్యమంత్రి ప్రసంగం లైవ్ టెలికాస్ట్‌కు ఏర్పాట్లు చేయాలి మార్చి 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణకు జిల్లా కేంద్రంలో విష్ణు కాలేజీ మెయిన్ ఆడిటోరియంలో అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలపై శనివారం కలెక్టరేట్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ వివిధ […]
Moreవిద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పరిశీలించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 06/03/2026మార్చి 16 నుంచి నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలి చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ అధికారులు సమన్వయంతో 10 తరగతి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయడానికి కృషి చేయాలి. పదవ తరగతి పరీక్షలు నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ అధికారులదే కీలక పాత్ర మాస్ కాపీయింగ్, తదితర ఎటువంటి పొరపాటు జరిగిన చర్యలు తప్పవ్ ఈ నెల 16వ తేదీ నుండి జరిగే పదవ తరగతి, అపోస్ పబ్లిక్ పరీక్షల […]
More