తుఫాను ప్రభావిత కుటుంబాలకు పంపిణీ చేయనున్న రేషన్ సరుకుల నిల్వలు, నాణ్యతను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

Publish Date : 06/11/2026

తుఫాను ప్రభావిత కుటుంబాలకు పంపిణీ చేయనున్న రేషన్ సరుకుల నిల్వలు, నాణ్యతను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

అర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు పంపిణీ చేయనున్న రేషన్ సరుకుల పంపిణీపై జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అధికారులతో సమీక్ష నిర్వహించి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియలో అర్హులైన ప్రతి కుటుంబానికి సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం నరసాపురంలోని బఫర్ గోడౌన్‌లో తుఫాను ప్రభావిత కుటుంబాలకు పంపిణీ చేసేందుకు నిల్వ ఉంచిన రేషన్ సరుకులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. గోడౌన్‌లో అందుబాటులో ఉన్న సరుకుల నిల్వలను, వాటి నాణ్యతను తనిఖీ చేశారు. పంపిణీకి సిద్ధంగా ఉన్న బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, నిర్దేశించిన పరిమాణంలో సరుకులను లబ్ధిదారులకు అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో ఆర్డీవో దాసిరాజు, డిఎస్ఓ ఎన్ సరోజ, ఏఎస్ఓ రవిశంకర్ తదితరులు ఉన్నారు.