పశ్చిమగోదావరి జిల్లాలో అర్నబ్ తుఫాను కారణంగా తీవ్రంగా ప్రభావితమైన కుటుంబాలకు ప్రత్యేక రేషన్ అందజేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ తెలిపారు.

Publish Date : 06/11/2026

అర్నబ్ తుఫాను ప్రభావిత కుటుంబాలకు ప్రత్యేక రేషన్ పంపిణీ….

పశ్చిమగోదావరి జిల్లాలో అర్నబ్ తుఫాను కారణంగా తీవ్రంగా ప్రభావితమైన కుటుంబాలకు ప్రత్యేక రేషన్ అందజేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ తెలిపారు.

జిల్లాలో మొత్తం 5 లక్షల 63 వేల తెల్ల రేషన్ కార్డులు ఉండగా, తుఫాను కారణంగా తీవ్రంగా ప్రభావితమైన 53 వేల మంది రేషన్ కార్డుదారులకు ప్రత్యేక రేషన్ కిట్ అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇందులో ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు, ఒక కేజీ పంచదార, ఒక లీటర్ పామాయిల్, ఒక కేజీ ఉల్లిపాయలు, ఒక కేజీ బంగాళాదుంపలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ తాడేపల్లిగూడెం మండలంలోని, అరుళ్ల గ్రామాల్లో పర్యటించి పలువురు రేషన్ కార్డుదారులకు ప్రత్యేక రేషన్ సరుకులను పంపిణీ చేశారు.

చేనేత కార్మికులు, మత్స్యకారులకు ప్రత్యేకంగా 50 కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు, ఒక కేజీ పంచదార, ఒక లీటర్ పామాయిల్, ఒక కేజీ ఉల్లిపాయలు, ఒక కేజీ బంగాళాదుంపలు అందజేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.

మిగిలిన 5 లక్షల 10 వేల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం పంపిణీ చేయనున్నట్లు ఆమె వివరించారు.