జిల్లాలో నవంబర్ 5వ తేదీన నిర్వహించిన జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ, జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రత నడుమ, ప్రశాంత వాతావరణంలో ప్రారంభం.
*భీమవరం డివిజన్ జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతం.
జిల్లాలో నవంబర్ 5వ తేదీన నిర్వహించిన జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ, జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రత నడుమ, ప్రశాంత వాతావరణంలో ప్రారంభం.
-**జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో భీమవరం డివిజన్ లో ఏర్పాటుచేసిన జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
శనివారం భీమవరం ఎస్.ఆర్.కె.ఆర్. కళాశాలలో జరుగుతున్న కౌంటింగ్ ఏర్పాట్లు ప్రక్రియను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్.కల్పశ్రీ స్వయంగా పరిశీలించి, పర్యవేక్షించారు.
జిల్లా వ్యాప్తంగా భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం మూడు ప్రధాన కేంద్రాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
జిల్లాలో ని మూడు కేంద్రాల పరిధిలోని మొత్తం 20 మండలాలకు సంబంధించి 238 కౌంటింగ్ టేబుల్స్‌ను ఏర్పాటు చేయడమైనదన్నారు. ఎన్నికల లెక్కింపు నిమిత్తం 280 మంది అధికారులను రిజర్వ్ సిబ్బందితో కలిపి నియమించామని, మొత్తంగా 1,110 మంది సిబ్బందిని కేటాయించటం జరిగిందన్నారు. సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ అందించి లెక్కింపు విధులకు కేటాయించటమైనదన్నారు.
ఈ కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లాజాయింట్ కలెక్టర్ కె ఆర్ కల్ప శ్రీ తో పాటు జిల్లా పరిషత్ సీఈవో, డిడిఓ దోసిరెడ్డి, డివిజన్ స్థాయి ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారన్నారు.
ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, పూర్తి పారదర్శకతతో ప్రశాంతంగా కౌంటింగ్ కొనసాగుతోందని తెలిపారు.