వరద ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణ సహాయం అందించాలి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఆర్నాబ్, మురుసు తుఫాన్, ప్రభావం భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల నిరాశలైన ప్రజలకు తక్షణ సహాయం అందించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్‌లోని వశిష్ట కాన్ఫరెన్స్ హాలులో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా ఎర్ర కాలువ నుంచి వచ్చిన వరద నీటితో జిల్లా లో, నందమూరు, యనమదుర్రు డ్రైన్ వరద ముంపుకు గురైన గ్రామాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం తరఫున అందించాల్సిన సహాయాన్ని నిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
వరద నీటిలో మునిగిన ఇళ్ల వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా సేకరించి, నష్టపోయిన పేద కుటుంబాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహాయం అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ, డిఆర్ఓ పి .గ్లోరియా, ఆర్డీవోలు కె.ఆర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, ఎం సూర్యారావు, జిల్లాలోని అందరు తాహసిల్దారు లు పాల్గొన్నారు.