తాడేపల్లిగూడెంలో స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
Publish Date : 06/11/2026
తాడేపల్లిగూడెంలో స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు తాడేపల్లిగూడెం డివిజన్‌కు సంబంధించి ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పరిశీలించారు.
ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా, కౌంటింగ్ హాళ్లలో చేపట్టిన మౌలిక సదుపాయాలు, ఓట్ల లెక్కింపునకు చేసిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.