Press Release
**పీఎంఎంఎస్‌వై పథకం ద్వారా రూ.33 లక్షలతో 11 మంది మత్స్యకారులకు ఐస్ బాక్స్‌తో కూడిన త్రిచక్ర వాహనాల పంపిణీ.
Published on: 14/11/2026మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట. **-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. భీమవరం, 14 నవంబర్, 2016. మత్స్యకారులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. శనివారం భీమవరం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మంజూరైన ఐస్ బాక్స్‌తో కూడిన 11 త్రిచక్ర వాహనాలను జిల్లా […]
అనధికార లేఅవుట్ ను క్షేత్రస్థాయి లో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
Published on: 13/11/2026కాళ్ళ మండలం పెదమిరం గ్రామంలో ఉన్న అనధికార లేఅవుట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా లేఅవుట్లకు సంబంధించిన అనుమతులు, ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశిత ప్రమాణాలను ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లేఅవుట్ల ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న అనుమతులు, సంబంధిత రికార్డులు, భూముల వివరాలు, నిబంధనల అమలు తీరుపై అడిగి తెలుసుకున్నారు. లేఅవుట్లలో నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు . భూములకు సంబంధించిన రికార్డులు […]
**జనగణన–2027 నిర్వహణకు అధికారులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. **జనాభా గణన ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలి.
Published on: 13/11/2026**జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. భీమవరం, 13 నవంబర్, 2026. జనగణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో భారత జనగణన–2027కు సంబంధించి రెండో దశ జనాభా గణన నిర్వహణపై జిల్లా, చార్జ్ స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జనగణన ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలు, అధికారుల బాధ్యతలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై […]
తాడేరు గ్రామంలో అనుమతులు లేని లేఅవుట్లను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్
Published on: 13/11/2026భీమవరం మండలం తాడేరు గ్రామంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా లేఅవుట్ల నమూనాలు, ప్లాట్ల విభజన విధానం, స్థలాల అమరిక తదితర అంశాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. లేఅవుట్లకు సంబంధించి పొందిన అనుమతులు, ప్రభుత్వ నిబంధనల మేరకు స్థల విభజన జరిగిందా లేదా అనే అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, సంబంధిత శాఖల అనుమతులు లేకుండా లేఅవుట్లు ఏర్పాటు చేయడం […]
**స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి.
Published on: 12/11/2026*జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలి. **రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా. భీమవరం, 12 నవంబర్, 2026. స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. అమరావతి సచివాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ […]
గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలను పూర్తిస్థాయిలో అరికట్టాలి
Published on: 12/11/2026పీసీ అండ్ పీ ఎన్ డీ టీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్టం అమలుపై జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పీసీ అండ్ పీ ఎన్ డీ టీ చట్టం అమలు తీరుపై సమీక్షించారు. స్కానింగ్ […]
మాతృ, శిశు మరణాల నివారణలో నిర్లక్ష్యం వహించే వైద్యులపై కలెక్టర్ ఆగ్రహం జన్మనిస్తూ తల్లి, జన్మిస్తూ శిశువు మరణించకూడదు
Published on: 12/11/2026జిల్లాలో మాతృ, శిశు మరణాలను సంపూర్ణంగా నివారించడమే లక్ష్యంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జూలై, ఆగస్టు, నెలల్లో సంభవించిన మాతృ, శిశు మరణాలపై సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో సంభవించిన మాతృ, శిశు మరణాలకు గల కారణాలు, భవిష్యత్తులో ఇటువంటి […]
నిమోనియా నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి
Published on: 12/11/2026నిమోనియా నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. 2026 నవంబరు 12వ తేదీ నుంచి 2027 ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిర్వహించనున్న నిమోనియా నివారణ అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికను గురువారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, మాట్లాడుతూ […]
పంట నష్టాల నమోదు ప్రక్రియను పరిశీలించి రైతులతో మాట్లాడిన జాయింట్ కలెక్టర్
Published on: 12/11/2026తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో ఖరీఫ్ 2026–27 సీజన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి, మద్దతు ధర పొందేలా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న […]
అత్తిలి మండలం గుమ్మంపాడు గ్రామంలో నిషేధిత జాబితాలో (22-ఏ) చేర్చిన గ్రామకంఠం భూముల సమస్యపై జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.
Published on: 12/11/2026అత్తిలి మండలం గుమ్మంపాడు గ్రామంలో నిషేధిత జాబితాలో (22-ఏ) చేర్చిన గ్రామకంఠం భూముల సమస్యపై జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో, డ్వామా, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖల అధికారులతో కలిసి సంబంధిత భూములను పరిశీలించారు. గ్రామకంఠం భూములను నిషేధిత జాబితాలో చేర్చడానికి గల కారణాలు, భూముల వాస్తవ పరిస్థితులు, సంబంధిత రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, […]