**స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి.

Publish Date : 12/11/2026
WhatsApp Image 2026-11-12 at 4.10.23 PM

*జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలి.

**రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా.

భీమవరం, 12 నవంబర్, 2026.

స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు.

అమరావతి సచివాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ​అనిల్ చంద్ర పునేఠా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపర్డెంట్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ​ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా పంచాయితీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించు జిల్లాలలో ఆయా జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపర్నెంట్లు ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు మూడు విడతలుగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. మొదటి విడత నోటిఫికేషన్ నవంబర్ 13వ తేదీ, రెండవ విడత నవంబర్ 16వ తేదీ, మూడవ విడత నవంబర్ 19వ తేదీ విడుదల చేయటం జరిగిందన్నారు.
మూడు విడతలుగా నామినేషన్ స్వీకరించడం జరుగుతుందని అన్నారు. మొదటి విడత నవంబర్, 15వ తేదీ, రెండవ విడత నవంబర్ 18 వ తేదీ, మూడవ విడత నవంబర్ 21వ తేదీన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు.
పోలింగ్ అండ్ కౌంటింగ్ ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
మొదటి విడత: నవంబర్ 26, 2026.
రెండవ విడత: నవంబర్ 29, 2026.
మూడవ విడత: డిసెంబర్ 02, 2026.
పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడుతుందని, పోలింగ్ ముగిసిన అనంతరం నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించనున్నందున
ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించటం జరిగిందని ఎన్నికల కమిషన్ కు తెలిపారు.

ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది విధుల నిర్వహణ, ఎన్నికల సామగ్రి పంపిణీ, రవాణా, పోలింగ్ అనంతరం కౌంటింగ్ ఏర్పాట్లు వంటి అన్ని అంశాలపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని తెలియజేయడం జరిగిందని ఎన్నికల కమిషనర్ కు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ​మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ 14 నవంబర్, 2026. ఈ తేదీ నుండి అభ్యర్థులు ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ​నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ 16 నవంబర్, 2026 మధ్యాహ్నం 3:00 గంటల వరకు.
​పోలింగ్ 26 నవంబర్, 2026 ఉదయం 7:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు.
​ఓట్ల లెక్కింపు ప్రక్రియ 30 నవంబర్, 2026 ఉదయం 8:00 గంటల నుండి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, భీమవరం మున్సిపాలిటీలకు ఈ నోటిఫికేషన్ అమలు కానున్నందున ఎన్నికలకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ కె ఆర్ కల్ప శ్రీ, డిఆర్ఓ పీ. గ్లోరీ, జిల్లా పంచాయతీ అధికారి పి. విజయ భాస్కర్, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.