**పీఎంఎంఎస్‌వై పథకం ద్వారా రూ.33 లక్షలతో 11 మంది మత్స్యకారులకు ఐస్ బాక్స్‌తో కూడిన త్రిచక్ర వాహనాల పంపిణీ.

Publish Date : 14/11/2026
WhatsApp Image 2026-11-14 at 3.03.47 PM

మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట.

**-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

భీమవరం, 14 నవంబర్, 2016.

మత్స్యకారులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.

శనివారం భీమవరం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మంజూరైన ఐస్ బాక్స్‌తో కూడిన 11 త్రిచక్ర వాహనాలను
జిల్లా కలెక్టర్ చేతులుమీదుగా అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ జండా ఊపి వాహనాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మత్స్యకారులకు ఐస్ బాక్స్‌తో కూడిన త్రిచక్ర వాహనాలను పంపిణీ చేయడం ద్వారా వారి జీవనోపాధికి మరింత భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. 2015-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 11 మంది మత్స్యకారులకు ఈ వాహనాలను పంపిణీ చేయటం జరిగిందన్నారు. రూ.33 లక్షల విలువైన వాహనాలను లబ్ధిదారులకు ప్రభుత్వ సబ్సిడీ క్రింద రూ.18 లక్షలు ఇవ్వటం జరిగిందన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకం కింద ఒక్కో త్రిచక్ర వాహనం యూనిట్ వ్యయాన్ని రూ.3 లక్షలుగా నిర్ణయించారని, ఈ పథకంలో జనరల్ కేటగిరీ లబ్ధిదారులకు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, మహిళా లబ్ధిదారులకు 60 శాతం చొప్పున ప్రభుత్వ సబ్సిడీ అందిస్తున్నారన్నారు. ఈ పథకం కింద జిల్లాలో మొత్తం 11 మంది లబ్ధిదారులకు రూ.33 లక్షల విలువైన త్రి చక్ర వాహనాలను పంపిణీ చేయగా, వీటికి సంబంధించి రూ.18 లక్షల ప్రభుత్వ సబ్సిడీ అందించటంజరిగిందన్నారు.
సామాజిక వర్గాల వారీగా 11 మంది
వాహనాలు పొందిన లబ్ధిదారుల వివరాలు:
జనరల్ కేటగిరీ – 3 మంది
ఎస్సీ కేటగిరీ – 5 మంది
ఎస్టీ కేటగిరీ – 1 మంది
మహిళా కేటగిరీ – 2 మంది
ఈ విధంగా అన్ని వర్గాల మత్స్యకారులకు ప్రభుత్వ పథకం ద్వారా ఆర్థిక చేయూత అందించడంతో పాటు, స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఐస్ బాక్స్‌తో కూడిన ఈ ప్రత్యేక త్రిచక్ర వాహనాల ద్వారా మత్స్యకారులు చేపలను పరిశుభ్రమైన, సురక్షితమైన పద్ధతిలో రవాణా చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. చేపలు ఎక్కువ సమయం తాజాగా ఉండటంతో పాటు, నాణ్యత దెబ్బతినకుండా మార్కెట్‌కు చేరవేయడానికి వీలవుతుందన్నారు.
దీనివలన మత్స్యకారులకు మెరుగైన ఆదాయం లభిస్తుందన్నారు. వినియోగదారులకు నాణ్యమైన తాజా చేపలు అందుబాటులోకి రావడంతో పాటు, మత్స్యకారులు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్‌కు తీసుకువెళ్లి మెరుగైన ధరలు పొందేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. మధ్యవర్తులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించుకోవడంతో పాటు, చేపల విక్రయాల ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఈ వాహనాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.

**మత్స్య రంగ అభివృద్ధికి ప్రభుత్వ ప్రత్యేక ప్రాధాన్యత.

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రధాన ఉద్దేశ్యం మత్స్య రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, చేపల ఉత్పత్తి, నిల్వ, రవాణా, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయడం, మత్స్యకారుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడం అన్నారు. అర్హులైన మత్స్యకారులకు ప్రభుత్వ సబ్సిడీతో కూడిన వాహనాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.