అత్తిలి మండలం గుమ్మంపాడు గ్రామంలో నిషేధిత జాబితాలో (22-ఏ) చేర్చిన గ్రామకంఠం భూముల సమస్యపై జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.

Publish Date : 12/11/2026
WhatsApp Image 2026-11-12 at 7.17.03 PM

అత్తిలి మండలం గుమ్మంపాడు గ్రామంలో నిషేధిత జాబితాలో (22-ఏ) చేర్చిన గ్రామకంఠం భూముల సమస్యపై జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా ఆర్డీవో, డ్వామా, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖల అధికారులతో కలిసి సంబంధిత భూములను పరిశీలించారు.
గ్రామకంఠం భూములను నిషేధిత జాబితాలో చేర్చడానికి గల కారణాలు, భూముల వాస్తవ పరిస్థితులు, సంబంధిత రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యారావు, డ్వామా పిడి డా.కె సి హెచ్ అప్పారావు, తహసిల్దార్ , ఎంపీడీవో,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.