గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలను పూర్తిస్థాయిలో అరికట్టాలి
పీసీ అండ్ పీ ఎన్ డీ టీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
గురువారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో పీసీ అండ్ పీఎన్డీటీ చట్టం అమలుపై జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో పీసీ అండ్ పీ ఎన్ డీ టీ చట్టం అమలు తీరుపై సమీక్షించారు.
స్కానింగ్ కేంద్రాల నిర్వహణ, నిబంధనల అమలు, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షల నివారణకు తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు,
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆడ శిశువుల పట్ల వివక్షకు తావులేకుండా
గర్భధారణకు ముందు, గర్భధారణ అనంతరం లింగ ఎంపిక పరీక్షలను నిషేధిస్తూ, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా చట్టం పరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే స్కానింగ్ కేంద్రాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఎం రవిబాబు, డాక్టర్ హాయ్ లక్ష్మి, సీఐ మురళీకృష్ణ, డిప్యూటీ డెమో ఏ వి వి రాజా ఆక్కులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.