అనధికార లేఅవుట్ ను క్షేత్రస్థాయి లో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
Publish Date : 13/11/2026
కాళ్ళ మండలం పెదమిరం గ్రామంలో ఉన్న అనధికార లేఅవుట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా లేఅవుట్లకు సంబంధించిన అనుమతులు, ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశిత ప్రమాణాలను ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లేఅవుట్ల ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న అనుమతులు, సంబంధిత రికార్డులు, భూముల వివరాలు, నిబంధనల అమలు తీరుపై అడిగి తెలుసుకున్నారు.
లేఅవుట్లలో నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు . భూములకు సంబంధించిన రికార్డులు పక్కాగా, వాస్తవ వివరాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు.