Press Release

Filter by:

ఘనంగా నిర్వహించిన సమగ్ర శిక్ష సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 09/06/2026

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను అత్యంత ప్రేమ, శ్రద్ధతో చూసుకోవాలి 326 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ ప్రత్యేక అవసరాలు (దివ్యాంగులు) గల విద్యార్థులను అత్యంత ప్రేమ, శ్రద్ధతో ఆదరించి వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. మంగళవారం భీమవరం పట్టణంలోని పిపి రోడ్‌లో ఉన్న ప్రత్యేక మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో పాఠశాల విద్య సమగ్ర శిక్ష […]

యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలి

Published on: 09/06/2026

అన్ని శాఖల సమన్వయంతో లక్ష్య సాధనకు కృషి చేయాలి జూన్ 11వ తేదీన నరసాపురం వలందర్ రేవు వద్ద 1000 మందితో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం …. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ […]

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్లుగా తప్పక నమోదు చేయించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 09/06/2026

బి ఎల్ ఓ లు ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలి జూలై 14 లోపుగా 95% పైబడి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతగా పూర్తి చేయాలి భీమవరం మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ హాల్ నందు మంగళవారం భీమవరం నియోజకవర్గం ఓటర్ల జాబితా సవరణపై (సర్ ) బిఎల్ఓ లకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ […]

“మీ భూమి – మీ హక్కు” గ్రామసభ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Published on: 08/06/2026

సిద్ధాంతం గ్రామం నుంచే రైతు సంక్షేమానికి మరో కీలక ముందడుగు రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ప్రభుత్వ రాజముద్రలతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి […]

జూన్ 13న నరసాపురం, జూన్ 14న పెనుగొండలో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహణ–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 07/06/2026

జిల్లాలో ఘనంగా ప్రారంభమైన “యోగాంధ్ర” కార్యక్రమం ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలి జూన్ 21 వరకు జిల్లావ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “యోగాంధ్ర” కార్యక్రమం జిల్లాలో నేడు ఘనంగా ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యంగా ఉంటే అంతకు మించిన సంపద లేదని, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. శనివారం భీమవరం పట్టణంలోని […]

సీఎం పర్యటనకు అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 06/06/2026

లోపాలు లేని పట్టాదారు పాస్ పుస్తకాలనే రైతులకు అందజేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ 8న పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శనివారం గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సభలకు నర్సాపురం డివిజన్ పరిధిలోని 24 గ్రామాలకు చెందిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న […]

సీఎం పర్యటన పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

Published on: 06/06/2026

విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవు కేటాయించిన విధులలో తప్పిదాలకు సంబంధిత అధికారులే బాధ్యులు పార్కింగ్ ఏర్పాట్లు పక్కాగా చేయాలి …. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జూన్ 8వ తేదీ సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధాంతం పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం ఉదయం నుండి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెనుగొండ మండలం సిద్ధాంతంలో ఏర్పాటు చేస్తున్న సభాస్థలి, హెలిపాడ్, పార్కింగ్ ప్రాంతం, క్యాడర్ మీటింగ్ ప్రాంగణం […]

ప్రజల నుండి వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 05/06/2026

ఆచంట నియోజకవర్గంలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం విజయవంతం ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ఆచంట నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నాలుగు విడతలుగా నిర్వహించిన ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం మార్టేరు శ్రీ వేణుగోపాల స్వామి ఆడిటోరియంలో నిర్వహించిన నాలుగో విడత నియోజకవర్గ స్థాయి ప్రత్యేక పీజీఆర్ఎస్ […]

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 05/06/2026

జూన్ 9 ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే చకచకా కొనసాగుతున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 9వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో కొనసాగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ నిర్మాణ పనులు, సభాస్థలి […]

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 05/06/2026

పర్యావరణ పరిరక్షణ మానవ మనుగడకు మంచి బాటలు వేస్తుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమవరం విష్ణు కాలేజీ ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేస్తున్న సీడ్ బాల్స్‌ను […]