Press Release
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి…. ఓటర్ల నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 24/10/2026ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి…. ఓటర్ల నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ప్రతినిధులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో శనివారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రభుత్వ, ప్రైవేటు […]
జిల్లా వైద్య శాఖ అధికారి డా. రవి బాబు , పట్టణంలో ఏరియా హాస్పిటల్ యాంటి రెట్రో వైరల్ కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా సందర్శించారు.
Published on: 24/10/2026జిల్లా వైద్య శాఖ అధికారి డా. రవి బాబు , పట్టణంలో ఏరియా హాస్పిటల్ యాంటి రెట్రో వైరల్ కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తెల్ల కార్డుల వాలిడేషన్ ప్రక్రియను పరిశీలించారు. సిబ్బంది రోగులకు అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ద్వితీయ 95 మరియు తృతీయ 95 లక్ష్యాల పురోగతిపై సమీక్షించారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చిన సూచనలు మేరకుయాంటి రెట్రో వైరల్ సెంటర్‌లో రిజిస్టర్ అయిన వారిలో కనీసం […]
జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
Published on: 24/10/2026జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పశ్చిమ గోదావరి జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్, జడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.ఆర్. కల్పశ్రీ శనివారం భీమవరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను పరిశీలించారు. నామినేషన్ పత్రాల్లో అభ్యర్థులు సమర్పించిన వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలను పరిశీలించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించారు.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తుఫాను, వరదల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
Published on: 24/10/2026భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తుఫాను, వరదల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం గూగుల్ మీటింగ్ ద్వారా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బి, ట్రాన్స్‌కో, విద్య, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, వ్యవసాయ, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తదితర శాఖల అధికారులతొ తుఫాను, […]
మహర్షి వాల్మీకి జీవితం, ఆయన రచనలు సమాజానికి స్ఫూర్తిదాయకం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 24/10/2026మహర్షి వాల్మీకి జీవితం, రచనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా శనివారం భీమవరం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి రచించిన రామాయణం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. రామాయణం ద్వారా మానవీయ విలువలు, ధర్మబద్ధమైన జీవనం, సత్యనిష్ఠ, కర్తవ్యపాలన […]
పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా ఏం . రవిబాబు వీరవాసరం లోని పలు ప్రైవేటు వైద్య, నిర్ధారణ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు
Published on: 23/10/2026పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా ఏం . రవిబాబు వీరవాసరం లోని పలు ప్రైవేటు వైద్య, నిర్ధారణ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా వీరవాసరం లోని డెంటల్ క్లినిక్లను సమగ్రంగా పరిశీలించారు. తనిఖీల ముఖ్య అంశాలు: * వైద్య కేంద్రాల రిజిస్ట్రేషన్ మరియు అనుమతి పత్రాల (Clinical Establishments Act) పరిశీలన. * ల్యాబ్‌లు, క్లినిక్‌లలో పనిచేస్తున్న సాంకేతిక సిబ్బంది అర్హతలు, నిబంధనల పాటింపు. * రోగులకు అందిస్తున్న […]
జిల్లాలో “జల జీవన్ మిషన్” పనులు వేగవంతం చేసి, ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలు పాటించటం తోపాటు తవ్విన ప్రాంతాలను సమంగా చేసి రోలింగ్ చేయడం తప్పనిసరి. *జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 23/10/2026జిల్లాలో “జల జీవన్ మిషన్” పనులు వేగవంతం చేసి, ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలు పాటించటం తోపాటు తవ్విన ప్రాంతాలను సమంగా చేసి రోలింగ్ చేయడం తప్పనిసరి. *జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో అమలవుతున్న జల జీవన్ మిషన్ (JJM) పనులను మరింత వేగవంతం చేయడంతో పాటు ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలను పాటించి, తవ్విన ప్రాంతాలను సమంగా చేసి రోలింగ్ చేయడం తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వశిష్ట […]
జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బి. నవ్య, ఐఏఎస్
Published on: 23/10/2026జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బి. నవ్య, ఐఏఎస్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాకు నియమితులైన ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బి. నవ్య, ఐఏఎస్ శుక్రవారం జిల్లాలో పర్యటించి ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతున్న కేంద్రాలను సందర్శించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. […]
పశ్చిమ గోదావరి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మూడు రోజులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 23/10/2026జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తి…: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పశ్చిమ గోదావరి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మూడు రోజులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం భీమవరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు […]
62 ఏళ్ల వయసులో యువతలో చైతన్యం నింపేందుకు ఇందుకూరి విజయలక్ష్మి సైకిల్ యాత్ర అభినందనీయం… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి,.
Published on: 23/10/202662 ఏళ్ల వయసులో యువతలో చైతన్యం నింపేందుకు ఇందుకూరి విజయలక్ష్మి సైకిల్ యాత్ర అభినందనీయం… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి,… మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించేందుకు ఇందుకూరి విజయలక్ష్మి చేపట్టిన సైకిల్ యాత్రను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందించారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం 62 ఏళ్ల వయసులో ఆమె చేపట్టిన ఈ యాత్ర స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ ప్రచారంలో భాగంగా ఇందుకూరి విజయలక్ష్మి అక్టోబర్ 22న భీమవరంలోని […]