జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

Publish Date : 24/10/2026
WhatsApp Image 2026-10-24 at 5.37.43 PM

జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

పశ్చిమ గోదావరి జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్, జడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.ఆర్. కల్పశ్రీ శనివారం భీమవరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను పరిశీలించారు.

నామినేషన్ పత్రాల్లో అభ్యర్థులు సమర్పించిన వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలను పరిశీలించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించారు.