జిల్లాలో “జల జీవన్ మిషన్” పనులు వేగవంతం చేసి, ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలు పాటించటం తోపాటు తవ్విన ప్రాంతాలను సమంగా చేసి రోలింగ్ చేయడం తప్పనిసరి. *జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
జిల్లాలో “జల జీవన్ మిషన్” పనులు వేగవంతం చేసి, ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలు పాటించటం తోపాటు తవ్విన ప్రాంతాలను సమంగా చేసి రోలింగ్ చేయడం తప్పనిసరి.
*జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
జిల్లాలో అమలవుతున్న జల జీవన్ మిషన్ (JJM) పనులను మరింత వేగవంతం చేయడంతో పాటు ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలను పాటించి, తవ్విన ప్రాంతాలను సమంగా చేసి రోలింగ్ చేయడం తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో ఆర్ & బి, ఆర్డబ్ల్యూఎస్, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ మెగా కంపెనీ ప్రతినిధులతో కలిసి తీరప్రాంత గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పైపులైన్ నిర్మాణాల అనంతరం తవ్విన ప్రాంతాలను సమంగా చేసి రోలింగ్ చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. జిల్లాలోని 6నియోజకవర్గాలకు చెందిన 16 మండలాల పరిధిలో 862 గ్రామాలకు ఈ ప్రాజెక్ట్ అమలు జరుగుతోందని అన్నారు. సుమారు రూ.1400 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 13.25 లక్షల కుటుంబాలకు శుద్ధమైన తాగునీటి సౌకర్యం కల్పించబడనుంది. ప్రాజెక్ట్ లో భాగంగా మొత్తం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని, ఈ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు 443.8 మీటర్ల మేరకు సరిపోయే పైపులను కొనుగోలు చేయడం జరిగిందని, 245.3 కిలోమీటర్ల మేర పైపులైన్ పనులు జరిగిందని అన్నారు. ముఖ్యంగా జిల్లాలో కొత్తగా నిర్మాణంలో ఉన్న రహదారుల ప్రాంతాల్లో ముందుగానే పైపులైన్ పనులను పూర్తి చేయాలని, తద్వారా భవిష్యత్తులో రోడ్లు మళ్లీ తవ్వాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పైపులైన్ వేసిన తర్వాత తవ్విన మట్టిని యథాతథంగా చదును చేసి, రోలింగ్ ద్వారా రహదారి స్థితిని పునరుద్ధరించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ సంస్థలదేనని స్పష్టం చేశారు. అలాగే జాతీయ రహదారులు, ఆర్ & బి రోడ్లు, గెయిల్ పైప్లైన్ క్రాసింగ్ ప్రాంతాల్లో పనులు చేపట్టే సమయంలో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పైపులైన్ మార్గంలో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్ట్ పనులు నిర్ణీత గడువులో పూర్తి కావడమే కాకుండా నిర్మాణ నాణ్యతపై ఎటువంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. రోడ్లను త్రవేముందు ఆర్ఎంబి అధికారులతో సమన్వయం చేసుకొని పనులు ప్రారంభించాలని సూచించారు. పనుల ప్రగతిని పంచాయతీరాజ్ ఎస్.ఇ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని అన్నారు.
సమావేశంలో ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ మెగా కంపెనీ ప్రతినిధులు ప్రస్తుత పనుల పురోగతిని వివరించారు.
**అనంతరం జిల్లా నీరు, పారిశుధ్య మిషన్ (DWSM) సమావేశం నిర్వహించడం జరిగింది.
జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరం లో 20 మండలాలకు గాను
వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు (IHHLs)
458 పనులు మంజూరు కాగా, వీటిలో 171
పూర్తయినవని, 202 పనులు
ప్రగతిలో ఉన్నాయని అన్నారు. ఇంకను
85 పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు.
**సామూహిక, సముదాయలైన గ్రామాలు, సచివాలయాలు, SC సంక్షేమ హాస్టళ్ల, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ప్రజా ప్రదేశాల్లో ప్రజలందరి ఉపయోగం కోసం మరుగుదొడ్లు నిర్మించేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 88 పనులు
మంజూరైనాయని, వీటిలో 36 పూర్తయినవని, ఇంకను 52 పనులు
ప్రగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో పారిశుధ్య పనులు పెండింగ్లో లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఇ బి. గిరి, ఇఇ జి.శ్రీనివాసరావు, డిఈ ఎ.శ్రీనివాసరావు, జిల్లా ఆర్ & బి ఇఇ ఎ. శ్రీనివాసరావు, మెగా కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ వాసు, నేషనల్ హైవేస్ ప్రతినిధులు, పంచాయతీరాజ్ ఇఇ, సిపిఓ కే శివ పార్వతి, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎం. రవిబాబు, ఎలక్ట్రికల్ ఇఇ, డిపిఒ, డ్వామా పిడి, డి ఆర్ డిఎ పిడి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
……………………………………………………………జిల్లా సమాచార శాఖ, భీమవరం
విడుదల చేసినది