జిల్లా వైద్య శాఖ అధికారి డా. రవి బాబు , పట్టణంలో ఏరియా హాస్పిటల్ యాంటి రెట్రో వైరల్ కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా సందర్శించారు.

Publish Date : 24/10/2026
WhatsApp Image 2026-10-24 at 5.07.18 PM

జిల్లా వైద్య శాఖ అధికారి డా. రవి బాబు , పట్టణంలో ఏరియా హాస్పిటల్ యాంటి రెట్రో వైరల్ కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా తెల్ల కార్డుల వాలిడేషన్ ప్రక్రియను పరిశీలించారు. సిబ్బంది రోగులకు అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ద్వితీయ 95 మరియు తృతీయ 95 లక్ష్యాల పురోగతిపై సమీక్షించారు.
నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చిన సూచనలు మేరకుయాంటి రెట్రో వైరల్ సెంటర్‌లో రిజిస్టర్ అయిన వారిలో కనీసం 95 శాతం మంది యాంటి రెట్రో వైరల్ మందులను క్రమం తప్పకుండా తీసుకునేలా సంబంధిత అధికారులకు, సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా,యాంటి రెట్రో వైరల్ మందులు వాడుతున్న వారిలో కనీసం 95 శాతం మందికి వైరల్ లోడ్ తగ్గి, వైరల్ సప్రెషన్ సాధించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ క్రమం లో ఆగస్టు నెలలో 94.23 శాతంగా ఉన్న లక్ష్యం చేరుకోగా , సెప్టెంబర్ నెలలో 95.09 శాతంకు పెరిగినట్లు తెలియజేశారు. ఇదే విధంగా యాంటి రెట్రో వైరల్ తణుకు మరియు తాడేపల్లిగూడెం కేంద్రాల్లో కూడా వారి లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు.
ఈ లక్ష్యాలను సాధించేందుకు ఏ ఆర్ టి కేంద్రం సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, రోగులకు క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ అందించాలని, మందుల వినియోగంపై అవగాహన కల్పించాలని మరియు వైట్ కార్డుల వాలిడేషన్‌ను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డా. గోవింద బాబు , డా. రాంబాబు మరియు యాంటి రెట్రో వైరల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.