పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
నరసాపురం మండలం చినమైనవారిలంక, వేములదీవి గ్రామాలలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ చేపట్టాలని, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు మరియు నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ విధులు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అనంతరం తుపాను, భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాయింట్ కలెక్టర్ వేముమాదేవి గ్రామంలోని తుపాను పునరావాస కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ కల్పించిన మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను అన్ని విధాలుగా సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వరదలతో శిథిలావస్థకు చేరిన నల్లి క్లిక్ ప్రాంతాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పిస్తూ పరిశీలించారు