చేనేత వస్త్ర అమ్మకాలకు ప్రోత్సాహకాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 27/07/2026సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేనేత వస్త్రాల అమ్మకాలను ప్రోత్సహించేందుకుగాను జిల్లా జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ తో కలిసి చేనేత కాటన్ చీరలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత చీరలను మగ్గాలపై నేసి తయారుచేసిన వస్త్రాలను వివిధ ప్రదేశాలలో అమ్మకాలకు ప్రదర్శించడం వలన వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయని అన్నారు. […]
Moreప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లో అందిన ఫిర్యాదులు క్షేత్రస్థాయి సిబ్బందితో జిల్లా అధికారులు నిరంతరం సమీక్షించుకుంటూ దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలి
Published on: 27/07/2026సమస్యలను అధికారుల దృష్టికి చేర్చే ఏకైక మార్గం. పీజీఆర్‌ఎస్‌లో 169, రెవెన్యూ క్లినిక్‌లో 43 దరఖాస్తుల స్వీకరణ* **జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులు, ఫిర్యాదులను అధికారులు స్వీకరించి ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా […]
Moreఘనంగా స్వర్గీయ శ్రీ ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు.
Published on: 26/07/2026భారతదేశంలో వస్త్ర కళలలో చేనేత రంగానికి ప్రత్యేక గుర్తింపు. * జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. చేనేత బాంధవుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్ర మానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, డిఆర్వో పీ. ప్రభాకర్,జిల్లా జౌళిశాఖ శాఖ ఏడి ఎ.అప్పారావు, జిల్లా పరిశ్రమలశాఖ మంగపతిరావు, […]
Moreవికసిత్ భారత్ జి రామ్ జి పధకం ద్వారా ఉద్యానవన పంటలను సాగు చేసి రైతులు అభివృ ద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 25/07/2026శనివారం పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో విస్తృత స్థాయిలో ఉద్యాన పంటలు ప్రోత్స హించడానికిజిల్లా కలెక్టర్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1500 ఎకరాల్లో ఉద్యాన వన పంటలుసాగు చేయుట ప్రభుత్వ లక్ష్యం కాగా ఇప్పటికీ 250 ఎకరాలలో వివిధ రకాలైన ఉద్యానవన పంటలు సాగు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. వికసిత్ భారత్ జి రామ్ జి పధకం క్రింద కూలీలకు కనీసం 312 రూపాయలు కనీస […]
Moreవిలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
Published on: 24/07/2026#పశ్చిమగోదావరి జిల్లాలో వైభవో పేతంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. #తల్లిదంద్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కు విశేష స్పందన. ** జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. విద్యా రంగంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విప్లవాత్మక సంస్కరణలు, డిజిటల్ విద్య, మౌలిక సదుపాయాల ఫలితాలు విద్యార్థులకు పూర్తిగా అందాలంటే తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఉండి మండలం, చెరుకువాడ జడ్పీ హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన మెగా “పేరెంట్-టీచర్ […]
Moreవిద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ అన్నారు.
Published on: 24/07/2026“మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ( PTM-4) కార్యక్రమంలో భాగంగా కాళ్ల మండలం సీసలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివి ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆమె తన విద్యాభ్యాస రోజుల్లో ఎదుర్కొన్న సవాళ్లను, అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. తాను […]
Moreజూన్ 12 నుండి ప్రభుత్వ పాఠశాలల ప్రారంభానికి పూర్తి స్థాయి సన్నద్ధత ఉండాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 10/06/2026వేసవి సెలవుల అనంతరం జూన్ 12 నుండి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పాఠశాలలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి విద్యాశాఖకు సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్ల అధికారులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ […]
Moreఆక్వా రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి ఎగుమతులకు అవసరమైన అనుమతులు తప్పనిసరిగా పొందాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 10/06/2026ఆక్వా రైతులు సాగు మరియు ఎగుమతులకు సంబంధించిన అన్ని అనుమతులు, రిజిస్ట్రేషన్లు తప్పనిసరిగా పొందడంతో పాటు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సాగు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మత్స్యశాఖ మరియు ఎంపెడా (MPEDA) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆక్వా రైతుల అవగాహన సదస్సులో బుధవారం జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులకు ఫార్మ్ రిజిస్ట్రేషన్, ఎంపెడా ఫార్మ్ ఎన్రోల్మెంట్, నాణ్యమైన రొయ్య […]
Moreతప్పులు లేని, ఖచ్చితమైన ఓటర్ల జాబితా కోసమే ‘సర్’ కార్యక్రమం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 10/06/2026భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన “సర్” కార్యక్రమం ద్వారా ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలుసుకొని, వారి వివరాలను ధృవీకరించడం ద్వారా తప్పులు లేని, శుద్ధమైన మరియు ఖచ్చితమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి బుధవారం ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని “సర్” కార్యక్రమంపై సవివరంగా సమీక్షించారు. […]
Moreఘనంగా నిర్వహించిన సమగ్ర శిక్ష సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 09/06/2026ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను అత్యంత ప్రేమ, శ్రద్ధతో చూసుకోవాలి 326 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ ప్రత్యేక అవసరాలు (దివ్యాంగులు) గల విద్యార్థులను అత్యంత ప్రేమ, శ్రద్ధతో ఆదరించి వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. మంగళవారం భీమవరం పట్టణంలోని పిపి రోడ్‌లో ఉన్న ప్రత్యేక మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో పాఠశాల విద్య సమగ్ర శిక్ష […]
More