పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్ర సమీక్షా బృందం (CRM) పర్యటన

Publish Date : 22/11/2026
WhatsApp Image 2026-11-22 at 4.29.58 PM
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర సమీక్షా బృందం ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనుందని జిల్లా వైద్యాధికారి డా ఏం రవిబాబు తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా బృందం సభ్యులు జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు , సామాజిక ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సందర్శిస్తారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరు, వైద్య సేవల నాణ్యత, మౌలిక సదుపాయాలు మరియు క్షేత్రస్థాయి అమలు తీరును బృందం సమగ్రంగా సమీక్షించనుంది.
పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్న బృందం సభ్యుల వివరాలు:
1.శ్రీమతి మోనా గుప్తా
2.డాక్టర్ స్మితా శ్రీవాస్తవ
3.శ్రీమతి మౌతుసి దేబ్‌నాథ్
4.డాక్టర్ బాబీ పాల్
5.డాక్టర్ పి.జె. శ్రీనివాస్
6.శ్రీ కె.ఆర్. మనీష్
7.డాక్టర్ యు.ఆర్. శేఖర్ నంబూరి
8.డాక్టర్ నరసింహ నాయక్, జాయింట్ డైరెక్టర్,
9.డాక్టర్ సి.హెచ్. శిరీష, ప్రోగ్రామ్ ఆఫీసర్, NHM
10.డాక్టర్ గీతా పద్మజ, ప్రోగ్రామ్ ఆఫీసర్, NHM
11.డాక్టర్ నాగలక్ష్మి, ప్రోగ్రామ్ ఆఫీసర్, NHM
12.డాక్టర్ ప్రసన్న కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్, NHM
13.వేణు కుమార్, కన్సల్టెంట్
14.వినోద్ కుమార్, కన్సల్టెంట్
15.సుశాంక్ నాయక్, CRM
ఈ పర్యటన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి రికార్డులు, నివేదికలను సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి , పశ్చిమగోదావరి జిల్లా.