అర్నబ్ తుఫానులో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెక్కు అందజేత… జిల్లా జాయింట్ కలెక్టర్ కె ఆర్ కల్పశ్రీ…

Publish Date : 18/11/2026
WhatsApp Image 2026-11-18 at 2.44.13 PM

అర్నబ్ తుఫాను కారణంగా మృతిచెందిన చొక్కా కిషోర్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన రిలీఫ్ నిబంధనల ప్రకారం రూ.5 లక్షల పరిహారం చెక్కును జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో అందజేశారు.

అదేవిధంగా, ఇదే తుఫాను కారణంగా తీవ్రంగా గాయపడిన పి. రాంబాబుకు రూ.50 వేల పరిహారం చెక్కును జాయింట్ కలెక్టర్ అందజేశారు. తుఫాను బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, నిబంధనల ప్రకారం పరిహారం అందజేస్తున్నట్లు తెలిపారు.