జనవరి 31న నిర్వహించనున్న డి.ఆర్.సి సమావేశానికి అన్ని అంశాలతో సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
Published on: 29/01/2026కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమై జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం (డీఆర్సీ) ఏర్పాట్లపై సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. డిఆర్సి సమావేశాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండల సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు […]
Moreజిల్లా అధికారులు ప్రతి అంశంలో జిల్లాను ముందంజలో ఉండేలా కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 29/01/2026జిల్లాలో పట్టణ, గ్రామీణ వైద్య సేవలు భేష్.. రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానం… యూరియా అందుబాటు, ధర, రవాణా శాఖ పన్నులు వసూలు, రెవిన్యూ సర్వీస్ లలో మొదటి మూడు స్థానాలు .. ప్రజా స్పందన నివేదికలో వెల్లడి… రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ రానున్న 2027 జనాభా లెక్కల సేకరణ,175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు, డిస్పెన్సరీలు, ఐఎంఎస్ ఆసుపత్రుల నిర్మాణానికి భూమి కేటాయింపు, పాజిటివ్ పబ్లిక్ పెరసెప్సన్ […]
Moreజిల్లా ఆసుపత్రి తణుకులో దశలవారీగా అన్ని వైద్య సదుపాయాలు కల్పించేందుకు నిరంతరాయంగా కృషి చేస్తున్నట్లు తణుకు నియోజవర్గం శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు.
Published on: 29/01/2026జిల్లా ఆసుపత్రి, తణుకు నందు బ్లడ్ సెంటర్, హీమోఫీలియా ట్రీట్మెంట్ సెంటర్, ఫిజియోథెరపీ విభాగములనుతణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధ కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డా.పగడాల సూర్యనారాయణ , ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధ కృష్ణ మాట్లాడుతూ ఎంతో ఖర్చుతో కూడుకున్న హీమోఫీలియా వైద్యాన్ని కూటమి ప్రభుత్వంలో పూర్తిగా […]
Moreపట్టాదారు పాసు పుస్తకాలు రైతుకు ఒకసారి అందజేసిన తరువాత మరల తప్పులు పునరావృతం కాకూడదు–జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 29/01/2026క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలి ప్రభుత్వ ఆదేశాలు మేరకు ప్రతి పట్టాదారు పాసుపుస్తకంను రైతుకు అందజేసే ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించి అందజేయాలని, ఒకసారి అందజేసిన తర్వాత తప్పులు ఎట్టి పరిస్థితుల్లో పునరావతం కాకూడదని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధింత అధికారులు ఆదేశించారు. ఇరగవరం మండలం కoతేరు గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటుచేసిన గ్రామ సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన […]
Moreజనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాలు నిర్వహణ–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 29/01/2026మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈనెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాలలో భాగంగా “స్పర్శ” లెప్రసీ అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, ఎం ఎల్ హెచ్ పి, ఏఎన్ఎంలు ఆరోగ్య కార్యకర్తలు అంగన్వాడి వర్కర్లు ప్రతిజ్ఞ చేయాలన్నారు. ప్రజలకు పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తుల […]
Moreరానున్న ఉగాది నాటికి జిల్లాలో 9,135 గృహాలను లబ్ధిదారులకు అప్పగించేందుకు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులను పూర్తి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 29/01/2026జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం జిల్లాలో గృహ నిర్మాణాల ప్రగతిపై సంబంధిత శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అధికారులతో మండలాల వారీగా గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు వచ్చే ఉగాది నాటికి లబ్ధిదారులకు అందించేందుకు 9,135 గృహ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా […]
Moreజిల్లాలో బాల్య వివాహాలు నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 29/01/2026బాల్య వివాహ ముక్తభారత్ వంద రోజులు కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం మరియు చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా రూపొందించిన “బాల్య వివాహ విముక్తి రథం” ను గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాను బాల్యవివాహారహిత జిల్లాగా తీర్చిదిద్దే విధంగా ప్రతి […]
Moreబీవి రాజు సర్కిల్ నందు నూతన బస్ స్టాప్ ను ప్రారంభించిన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 29/01/2026ప్రజలకు మేలైన సౌకర్యాలు కల్పనలో భాగంగా బీవి రాజు ఫౌండేషన్ సహకారంతో నూతన బస్టాండ్ నిర్మాణం… భీమవరం పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం పట్టణంలోని బివి రాజు సర్కిల్ నందు బివి రాజు ఫౌండేషన్ దాతృత్వంతో రూ.8 లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన నూతన బస్ స్టాప్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ […]
Moreమిల్లింగ్ కార్యకలాపాల నుండి ఉత్పత్తి అయ్యే ఉప-ఉత్పత్తుల సద్వినియోగంపై ఆలోచన చేయాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 28/01/2026కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం జిల్లా పౌర సరఫరాల మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా పరిశ్రమల అధికారులతో సమావేశమై మిల్లింగ్ కార్యకలాపాల నుండి ఉత్పత్తి అయ్యే ఉప-ఉత్పత్తులను ఉపయోగించి పరిశ్రమల అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మిల్లింగ్ ఉప-ఉత్పత్తుల సమర్థవంతమైన వినియోగం ద్వారా విలువ జోడింపు (value addition)కు ఉన్న విస్తృత పరిధిని సమీక్షించారు. అలాగే […]
Moreఫిబ్రవరి 2 నుండి 9 వరకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి సమాయత్తం కావాలి–జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 28/01/2026ఫేజ్ – 4 రీ సర్వేను ప్రభుత్వం నిర్దేశించిన కాలవ్యవధిలో పూర్తిచేయాలి. కలెక్టరేట్ ఛాంబర్ నుండి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, రీ సర్వే, సుమోటో కాస్ట్ వెరిఫికేషన్, ఐ వి ఆర్ ఎస్ కాల్స్ అంశాలపై ఆర్డీవోలు, తహసిల్దార్లు, మండల సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2 తేదీ నుండి 9వ తేదీ వరకు 14 గ్రామాలలో 10,777 […]
More