త్వరలో నాలుగు కోట్లతో మొబైల్ క్యాన్సర్ టెస్టింగ్ వ్యాన్ అందుబాటులోకి: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ప్రకటన
Published on: 07/12/20253 కోట్లతో భీమవరం, ఆచంటలో డయాలసిస్ సెంటర్ల నిర్మాణ పనులను ప్రారంభించిన కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఆరు నెలలో నిర్మాణ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించిన కేంద్రమంత్రి ప్రజలకు అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చొరవతో భీమవరం, ఆచంటలలో అత్యాధునిక ప్రభుత్వ డయాలసిస్ విభాగాల నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. రెండుచోట్ల కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ […]
Moreఅధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, యాక్షన్ చేయాలి, వీధులను శుభ్రంగా ఉంచాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 07/12/2025ఆక్రమణలు తొలగింపు విషయములలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి భీమవరం పట్టణంలో వీరమ్మ పార్కు రైతు బజార్, , కొత్త బస్ స్టాండ్, రైల్వే జంక్షన్, ప్రకాశం చౌక్, జేపీ రోడ్డు, ప్రాంతాల లో ఆదివారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రెవిన్యూ, మున్సిపల్ శాఖ అధికారులతో కలసి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ కోర్ట్ లు ఏర్పాటు, ఆక్రమణలు తొలగింపు, పారిశుధ్యం, కూరగాయల ధరలు నియంత్రణ విషయములలో అధికారులు ప్రత్యేక […]
Moreపుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ స్థాపనలో ఎస్ హెచ్ జి మహిళలు అవగాహన కలిగి యూనిట్ల స్థాపన ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 06/12/2025భీమవరం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అండ్ డిఆర్డిఏ సంయుక్తంగా నిర్వహించిన “ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్దీకరణ పథకం” ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఇప్పటికే స్థాపించిన యూనిట్లకు ఆధునిక సాంకేతికతను జోడించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ […]
Moreవిభిన్న ప్రతిభావంతులు ధైర్యంగా ముందుకు నడవాలని, సాధారణ వ్యక్తులకు తీసిపోని విధంగా అన్ని రంగాలలో మీ ప్రతిభను చాటాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.
Published on: 06/12/2025విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో శనివారం భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఆటల మైదానం నందు ఏర్పాటుచేసిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత విభిన్న ప్రతిభావంతులు జిల్లా కలెక్టర్ ను ఆహ్వానిస్తూ అందజేసిన పుష్పగుచ్చాలను ప్రేమ, ఆప్యాయతలతో పలకరిస్తూ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ దివ్యాంగులు ఏ రంగంలోనూ తక్కువ కాదనేది ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైందన్నారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు నడవాలని, […]
Moreయువత దేశానికి దిశా నిర్దేశమని, అదే స్థాయిలో ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి సురక్షితమైన వాహన చోదన ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 06/12/2025శనివారం బివి రాజు కూడలి నుండి ఏర్పాటుచేసిన ట్రాఫిక్ పై అవగాహన త్రీ కే రన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, పెద్ద ఎత్తున కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు, అధికారులు, ప్రజలు, అథ్లెటిక్స్, వాకర్స్ అసోసియేషన్స్ పాల్గొని త్రీ కే రన్ ను జువ్వలపాలెం రోడ్ లోని అల్లూరి సీతారామరాజు […]
Moreఆర్థిక కారణాలతో చదువుని కొనసాగించలేని వారికి *”సరస్వతీ విద్యా నిధి” ద్వారా సహకారం… నేడు సభా వేదిక నుండి ప్రకటన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 05/12/2025తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం విద్యార్థుల భవిష్యత్ కి ఒక చక్కని దిశా నిర్దేశం .. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మార్గ నిర్దేశంగా పిటిఎం దోహదపడుతుంది విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలి. శుక్రవారం భీమవరం మండలం గూట్లపాడు గ్రామంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 3.O కి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థనాగీతంతో […]
Moreజిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలలో ఏర్పాటుచేసిన ఇసుక నిల్వ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ఇసుక నిల్వలపై తక్షణమే నివేదిక అందించాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 04/12/2025ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవు. ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదును అధికారులు అధ్యయనం చేసి ఫిర్యాదు దారు సంతృప్తి చెందే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలి గురువారం జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పిజిఆర్ఎస్, రీ సర్వే, ఇళ్ల స్థలాలు, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, రెవెన్యూ అంశాల ప్రగతిపై, డిఆర్ఓ, ఆర్డీవోలు, తహసిల్దార్లు, సర్వేయర్లుతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ […]
Moreపంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి డివిజనల్ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు ఎంతగానో తోడ్పడతాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 04/12/2025గురువారం ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో నూతనంగా నిర్మించిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయంతో పాటు రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన మొత్తం 77 డిడిఓ కార్యాలయాలయ భవనాలను లాంచనంగా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకోడేరు మండలంలోని విస్సా కోడెరు గ్రామంలో ఏర్పాటుచేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, భీమవరం ఆర్డీవో […]
Moreజిల్లాలో జల జీవన్ మిషన్ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలు సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 04/12/2025గురువారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జలజీవన్ మిషన్ ఫేజ్ వన్ కింద కోస్తా ప్రాంతంలో తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ ఏర్పాటు పనులపై సంబంధిత శాఖలతో కన్వర్జెన్సీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ స్థితిగతులను ప్రాజెక్ట్ నిర్మాణం గుత్తేదారుడు ప్రతినిధి మెయిల్ కంపెనీ డీజీఎం పి.వాసు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జల జీవన్ […]
Moreఅన్న క్యాంటీన్ లో ఆహార నాణ్యత, వసతులను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 04/12/2025అన్న క్యాంటీన్ లో ఆహారం నాణ్యతతో కూడి, పరిశుభ్రమైన వాతావరణంలో అందించాలి… గురువారం నరసాపురం స్టీమర్ రోడ్ లో ఉన్న అన్న క్యాంటీన్ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ ఆకస్మిక తనిఖీ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నా క్యాంటీన్లో నిర్వహణ, పరిశుభ్రత, ఆహార నాణ్యత, వసతులును పరిశీలించారు. భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడారు, పలు సూచనలు ఇచ్చారు. స్వయంగా లబ్ధిదారులకు భోజనమును వడ్డించారు. స్వయంగా […]
More