Close

జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూల కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 12/02/2026

నులి పురుగుల నిర్మూలనకు 1 టు 19 వయసు కలిగిన పిల్లలందరికీ ఆల్బెండజోల్ తప్పనిసరిగా టాబ్లెట్లు అందించాలి

1 – 2 సంవత్సరాల వరకు వయసు కలిగిన పిల్లలకు ఆల్బెండజోల్ సగం టాబ్లెట్ (200 mg) మాత్రమే పొడి చేసి నీటిలో కరిగించి అందించాలి.

అంగన్వాడి సిబ్బంది చిన్నారుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

3 – 19 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు మధ్యాహ్న భోజనం అనంతరం ఆల్బెండజోల్ (400 mg) పూర్తి మాత్రను చప్పరించి నమిలి మింగేలా చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో గురువారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా జరిగిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఫిబ్రవరి 17న 3,793 విద్యాసంస్థలలోని అంగన్వాడి, పాఠశాలల, కళాశాలలు, బడి బయట పిల్లలు మొత్తం 3,51,125 మంది బాలల లక్ష్యంగా ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వైద్య శాఖ అధికారులు ఆదేశించారు.

పిల్లల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార లోపాన్ని తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1- 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మరియు కిశోరు బాలలకు అల్బెండాజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. వీరితోపాటు వివిధ ఫ్యాక్టరీలలో, ఆక్వా రంగంలో, ఎస్సీ, ఎస్టీ కాలనీలలో ఉంటున్న పిల్లలను ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి నులిపురుగుల నివారణ టాబ్లెట్ ను తప్పకుండా అందించాలన్నారు. పిల్లలలో రక్తహీనత, పోషకాహార లోపం, బరువు తగ్గడం, చదువులో ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలకు నులిపురుగుల నివారణ ద్వారా సాధ్యమవుతుందన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఆంగన్‌వాడీ కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు అమలు చేయాలన్నారు. ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు పిల్లలకు మాత్రలను మధ్యాహ్నం భోజనం అనంతరం సురక్షితంగా అందించి, పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం వంటి అలవాట్లపై అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా నులిపురుగు నివారణ మాత్రలు ఇప్పించేందుకు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఒకటి, రెండు సంవత్సరాలు వయసు కలిగిన పిల్లలకు సగం టాబ్లెట్ నీటిలో కరిగించి మాత్రమే అందించాలని, ఈ విషయమై అంగన్వాడి సిబ్బంది ప్రత్యేక సర్దు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 17వ తేదీన ఆల్బెండజోల్ మాత్రలు తీసుకొని పిల్లలకు ఫిబ్రవరి 24న అందించడం జరుగుతుంది అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వసతి గృహాలలో వంటలు చేసే సిబ్బందికి కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని సూచించారు. నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్భంగా రెండు రోజులు ముందుగానే జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయ సమావేశాన్ని నిర్వహించి వారి పరిధిలోని పాఠశాలలలో ఈ కార్యక్రమం నూరు శాతం అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించే తేదీని పిల్లల డైరీలో నమోదు చేసి తల్లిదండ్రులకు తెలిసే విధంగా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.

జాతీయ నులిపురుగుల నిర్మూల కార్యక్రమంలో భాగంగా రూపొందించిన “ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగులను నులి మేద్దాం..” గోడపత్రికను సమావేశా అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ జి.గీతబాయి, డి సి హెచ్ ఎస్ పి.సూర్యనారాయణ, ఆర్ బి ఎస్ కే ప్రోగ్రాం అధికారి కె.ఎం కిషోర్, జిల్లా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అధికారి వై దోసిరెడ్డి, డిపిఓ రామ్ రామనాథరెడ్డి, డీఈవో ఈ నారాయణ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అరుణ కుమారి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏ.వి సూరిబాబు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి పుష్ప రాణి, వివిధ శాఖల అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.