Close

జిల్లాలో సాగునీటి పారుదలకు ఇబ్బంది లేని విధంగా అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Publish Date : 13/02/2026

జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో చేపట్టిన, చేపట్టవలసిన వివిధ సాగునీటి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గత సమావేశంలో శాసనసభ్యులు ప్రస్తావించిన సాగునీటి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు మంజూరు కానీ పనులకు వెంటనే ప్రతిపాదనలను సమర్పించాలని సూచించారు. సాగునీటి డ్రైయిన్ లు, షట్టర్లు, కాలవగట్లు దెబ్బతినే అవకాశం ఉన్న పనులను ముందుగానే గుర్తించి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేసి, మంజూరు అయిన వెంటనే పూర్తి చేయాలన్నారు. పనులు మంజూరులో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకురావాలని సూచించారు. కాలవలు కట్టివేకముందే టెండర్లను ముగించి కాలవలు నిలుపుదల చేసిన వెంటనే పనులను ప్రారంభించాలని ఆదేశించారు. తూడు తొలగింపు పనులు మంజూరైన కాలువలు, డ్రైయిన్ లలో కంటికి కనిపించేంత స్పష్టంగా తొలగింపు పనులను చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా మొగల్తూరు మండలంలో ఎక్కువ తూడు తొలగింపు పనులు మంజూరయ్యాయని, ఎక్కడ ఫిర్యాదు రాని విధంగా త్వరగా పనులను పూర్తి చేయాలన్నారు. ఫిబ్రవరి నెలాఖరకు నరసాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఉండవచ్చని సూచనప్రాయంగా తెలియజేశారు. పశ్చిమ డెల్టా కింద 11 ప్రధాన కాలువలు 352.62 కిలోమీటర్ల విస్తరించి ఉన్నాయన్నారు. బ్రాంచ్ కెనాల్సు 1,044.57, మేజర్ & మైనర్ కెనాల్స్ 824.11 కిలోమీటర్లు మొత్తం 2,221 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఓ అండ్ ఎమ్ పనులకు రూ.1273.65 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. 152 తూడు తొలగింపు, 74 పూడిక తీత, 24 షట్టర్లు మరమ్మత్తులు, 41 టేప్ గ్రాస్ తొలగింపు, 42 ఇతర పనులు ఉన్నాయన్నారు. అలాగే డ్రైయిన్స్ లో తూడు తొలగింపు, ఇతరత్రా పనుల నిమిత్తం మంజూరు చేసిన నిధులను సక్రమంగా వినియోగించి సకాలంలో పనులను పూర్తి చేయాలన్నారు. దర్భ రేవు పూడికతీత పనులకు వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో కెనాల్స్ ఇఇ యు.రమేష్, డ్రెయిన్లు ఇఇ సీహెచ్ సత్యనారాయణ, డీఇలు పి ఎన్ వి ఎస్ ఎస్ మూర్తి, కే ధర్మజ్యోతి, ఏ వెంకటలక్ష్మి, కే శ్రీనివాస్, జి వినోద్ చంద్, వెంకటనారాయణ, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.