Close

Press Release

Filter by:

మాజీ సైనికుల కుటుంబాల సంక్షేమానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 03/12/2025

బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో డిసెంబర్ 7 సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా వాల్ పోస్టరు, స్టిక్కర్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించి సాయుధ దళాల పతాకనిదికి తమ మొదటి విరాళం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భారత సైనికదళాల దేశభక్తి, సాహసము, త్యాగాల పట్ల దేశం గర్విస్తున్నదన్నారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ లోను, ప్రకృతి వైపరీత్యాల సమయంలోను, దేశ సరిహద్దులు, వెలుపల మన సైనికుల […]

More

బాగా చదివిన వారికే రెసిడెన్షియల్ పాఠశాలలో అవకాశాలు వస్తాయని, కష్టపడి, అర్థం చేసుకుని చదివి, జీవితంలో క్రమశిక్షణతో మెలగాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యార్థులకు సూచించారు

Published on: 03/12/2025

పెనుగొండ గ్రామంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం ఆచంట పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. పిల్లలు ఎవరన్నా రక్తహీనతతో ఉన్నారా, డ్రింకింగ్ వాటర్ ఏం ఉపయోగిస్తున్నారు, పిల్లల చిక్కి తింటున్నారా, పిల్లలకి ఏం మెనూ ఇస్తున్నారు, హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారా, ప్రతిరోజు ఆరోగ్య పరీక్షలు జరుగుతున్నాయా, డ్రింకింగ్ వాటర్ శాంపిల్స్ సేకరిస్తున్నారా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ ను పిల్లలకి అందజేశారా, దుప్పట్లు అందరికీ ఉన్నాయా, వంట వాళ్ళు పరిశుభ్రంగా […]

More

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో నానాటికి పెరుగుచున్న వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు “ట్రాఫిక్ ఫ్రీ” గా కృషి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Published on: 02/12/2025

ట్రాఫిక్ అడ్డంకుల నియంత్రణలో జిల్లా ప్రజలు, విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరించాలి… పట్టణాన్ని ట్రాఫిక్ ఫ్రీగా చేసుకోవడం మన అందరి బాధ్యత.. దండించి, భయపెట్టి ఆలోచన జిల్లా యంత్రాంగానికి, పోలీస్ శాఖకు లేదు.. ప్రజల స్వచ్ఛందంగా అవగాహన కలిగి మెలగాలి ట్రాఫిక్ అవరోధాలను నిరోధించేందుకు రెవిన్యూ, పోలీస్, మున్సిపాలిటీ, తదితర శాఖలతో ఎన్ఫోర్స్మెంట్ టీంలు ఏర్పాటు.. ఎన్ఫోర్స్మెంట్ టీములు ట్రాఫిక్ అవరోధాల నియంత్రణకు గట్టిగా కృషి చేయాలి మంగళవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ […]

More

భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మాక్ అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులుగా ప్రతిభ చూపిన విద్యార్థులు భవిష్యత్తులో నాయకులుగా ఎదగాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 01/12/2025

భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా నవంబర్ 26వ తేదీన మాక్ అసెంబ్లీ నిర్వహణలో ప్రజా ప్రతినిధులుగా అద్భుత ప్రతిభ చూపిన జిల్లాకు చెందిన ఎనిమిది మంది విద్యార్థిని, విద్యార్థులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులుగా మాక్ అసెంబ్లీ నిర్వహణలో పశ్చిమగోదావరి జిల్లా నుండి ఏడు నియోజకవర్గాల నుండి ఒక్కొక్క విద్యార్థి ప్రజాప్రతినిధిగా హాజరై అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించడం చాలా […]

More

శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.

Published on: 01/12/2025

గోదావరి క్రీడా సంబరాల ఆటల పోటీలలో అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా పాల్గొనాలి. సోమవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో డిసెంబర్ రెండో వారంలో నిర్వహించనున్న గోదావరి క్రీడా సంబరాల సంబరాల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల ద్వారా ఉద్యోగుల మధ్య మంచి సత్సంబంధాలు, స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడలు దోహదపడతాయి అన్నారు. కావున, జిల్లా అధికారుల […]

More

ప్రభుత్వం పెద్ద మొత్తంలో సామాజిక పెన్షన్లు అందజేస్తున్నది, భవిష్యత్తు అవసరాల కోసం ఎంతో కొంత పొదుపు చేసుకోవాలి.

Published on: 01/12/2025

సోమవారం ఉండి గ్రామం ఒకటవ వార్డులో డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎప్పటిలానే ఎన్టీఆర్ భరోసా సామాజిక భదత్రా […]

More

హెచ్ఐవి, ఎయిడ్స్ ప‌ట్ల విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ చదలవాడ నాగరాణి సూచించారు

Published on: 01/12/2025

ప్ర‌పంచ ఎయిడ్స్ దినోత్స‌వం సంద‌ర్భంగా భీమవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద అవ‌గాహ‌నా ర్యాలీని సోమ‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ప్రకాశం చౌక్ వ‌ర‌కు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సంద‌ర్భంగా జిలా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఎయిడ్స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండేందుకు నిరంత‌రం అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎయిడ్స్ బారిన ప‌డ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై కూడా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. జిల్లాలో సుమారు 1,500 మంది ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు ఉన్నారన్నారు. కొత్తగా […]

More

మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా ఉద్యోగంలో చేరి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి.

Published on: 29/11/2025

శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో భీమవరంలోని ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు నిర్వహించిన మెగా జాబ్ మేళా సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట్ర పీఏసీ చైర్మన్ […]

More

భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న రెండు రోజులు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రైతుల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 29/11/2025

శనివారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ దిత్వ తుఫాను కారణంగా జిల్లాలో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు ఇప్పటికే కోసిన పంటను జాగ్రత్త చేసుకోవాలన్నారు. ధాన్యం నూర్పిడి అయితే వెంటనే ధాన్యం […]

More

ఏప్రిల్ 15 నాటికి దళ్వా పంటసాగు పూర్తి అయ్యేలా అధికారులు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలి. …. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 29/11/2025

శనివారం కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో రబీ పంట కాలానికి నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రభీ సాగుకు రైతులకు ఎటువంటి నీటి కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. డిసెంబర్ ఒకటో తేదీ నుండి దళ్వా సాగుకు నీటి సరఫరాకు […]

More