Close

ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 12/02/2026

అమృతవన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

అమృత వన్ పథకం సమర్ధవంతంగా అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

భీమవరం పట్టణం శ్రీరాంపురం, ఏఎస్ఆర్ నగర్ లో చేపట్టిన అమృత్ ఫేజ్ -1 పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్థానిక ప్రజలతో మాట్లాడారు. తాగునీరు ఏ విధముగా వస్తుంది, కుళాయిల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా వస్తుందా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయ అని అడిగి తెలుసుకున్నారు. అమృత పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో తాగునీటి వనరులను మెరుగుపరచడం, ముఖ్యముగా శుద్ధి చేసిన త్రాగునీటిని ప్రతి కుటుంబానికి అందించడం ప్రధాన లక్ష్యం అని అన్నారు. పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా వ్యవస్థను ఆధునికరించాల్సిన అవసరం ఉందన్నారు. పాత పైపులైన్ల స్థానంలో అమృత పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన అన్ని కొత్త పైప్ లైన్ల సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా ఎక్కడైనా లీకేజీలు సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలన చేసుకుని తద్వారా మంచి నీటి సరఫరాను ఆధునికరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా నీటిని వినియోగంలో వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అమృత వన్ పథకం ద్వారా పట్టణాల అభివృద్ధి ఆరోగ్య పరిరక్షణ జీవన ప్రమాణాల పెంపు సాధ్యమవుతుందని తెలిపారు. అమృతవన్ పథకాన్ని సమయానికి పూర్తి చేసి ప్రజలకు శుద్ధి జలాలను అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంలో మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్ర రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఇంచార్జ్ ఇఇ ఆర్.విజయ్, డిఈ తాత బాబు, సిబ్బంది తదితరులు ఉన్నారు.