Close

Press Release

Filter by:

ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్త దానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 12/12/2025

రక్తం కొరత కారణంగా ప్రాణాపాయ స్థితి, అనారోగ్యంతో ఏ ఒక్కరి ప్రాణం కోల్పోకూడదు. శుక్రవారం కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, పశ్చిమ గోదావరి జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగుల రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అందరిలో స్ఫూర్తిని నడపడానికి స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా […]

More

పల్స్ పోలియో కార్యక్రమం పై గ్రామ, మండల, డివిజనల్, మున్సిపల్, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలు నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 11/12/2025

జిల్లాలో డిసెంబర్ 21 ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చేయాలి. 0-5 సంవత్సరాల వయసు గల ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు అందించాలి. గురువారం కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా ప‌ల్స్‌పోలియో టాస్క్‌ఫోర్స్ క‌మిటీ స‌మావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 21 ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని […]

More

ఇంధనాన్ని పొదుపు చేసి భావితరాలకు వనరులను కాపాడాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 11/12/2025

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు 2025 భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీo అస్మి చేతుల మీదుగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు-2025 గోడ పత్రికను విద్యుత్ శాఖ ఇంజనీర్ల తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ డిసెంబర్ 14 వ తేదీ నుండి 20 వ […]

More

వివిధ శాఖలలో పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగం లోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 11/12/2025

జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఏపీ ఈ డబ్ల్యూ ఐ డి సి, సమగ్ర శిక్ష, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ శాఖల ఇంజనీరింగ్ విభాగాల పర్యవేక్షణలో పీఎం శ్రీ వర్క్స్, మనబడి మన భవిష్యత్తు ఫేజ్ వన్ అండ్ టు, జల జీవన్ మిషన్ పనులు, జిల్లాలోని భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు మున్సిపాలిటీలు, ఆకివీడు నగర పంచాయతీలలో చేపట్టిన, చేపట్టవలసిన పనుల పురోగతిపై జిల్లా […]

More

విభిన్న ప్రతిభావంతులు తమలో నిబిడికృతమైన నైపుణ్యాలను గుర్తించి సాధన చేస్తే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవచ్చు–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఉన్నారు.

Published on: 10/12/2025

అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలు-2025 సందర్భంగా బుధవారం భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విభిన్న ప్రతిభావంతులు జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా క్రీడలలో గెలుపొందిన విభిన్న ప్రతిభావంతులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు తమలోని నిబిడీకృతమైన నైపుణ్యాన్ని వెలికి తీసి దానిపై పట్టు సాధిస్తే ఉన్న స్థితికి చేరుకోవచ్చు అన్నారు. శరీరంలో […]

More

నూతన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బ్యాంకు రుణాలు మంజూరుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 09/12/2025

పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి నూతన పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి మరియు ఇన్వెస్టర్లతో ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలలో అభివృద్ధి సంతృప్తికరంగానే ఉన్నదని, పారిశ్రామికంగా అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, నూతన […]

More

జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతుంది–జిల్లా జాయింట్ కలెక్టరేట్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 09/12/2025

ఇప్పటి వరకు 37 వేల మంది రైతుల నుండి 2.40 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు.. ధాన్యం కొనుగోళ్లులో ఇబ్బందుల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ నెం.8121676653 తూకం 40 కేజీల 600 గ్రాములు మాత్రమే పట్టాలి.. అలాకాదని తేమసాకుతో 41 లేదా 42 కేజీలు పడితే చర్యలు తప్పవ్.. ధాన్యం కొనుగోళ్లులో రైతులు ఇబ్బందుల పరిష్కారానికి క్విక్ రెస్పాన్స్ టీమ్ లు ఏర్పాటు 90 వేల గన్ని బ్యాగులు ఆర్.ఎస్.కె లలో సిద్ధంగా ఉంచాం ధాన్యం కొనుగోలు […]

More

ఏపీ టెట్ 2025 టీచర్స్ అర్హత పరీక్షలు నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Published on: 08/12/2025

సోమవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహణకు తీసుకోవలసిన చర్యలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 10 వ తేదీ నుండి 21 వ తేదీ వరకు జరగనున్న టెట్ పరీక్షలు నిర్వహణకు జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భీమవరంలో శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ ఉమెన్స్, […]

More

జిల్లా అధికారులు తమ ఉద్యోగులతో పాటు, అనుబంధ సంస్థల ఉద్యోగులలో రక్తదానంపై అవగాహన కల్పించాలి–జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 08/12/2025

భీమవరం జిల్లా కలెక్టరేట్ లో డిసెంబర్ 12న రక్తదాన శిబిరం నిర్వహణ సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా యూనిట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో 2026వ సంవత్సర వార్షిక రక్తదాన శిబిరాల ఏర్పాటు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమగోదావరి జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందితో 2025 డిసెంబర్ […]

More

అర్జీదారుల ఫిర్యాదులు నిర్దేశించిన గడువులోగా వారు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి,

Published on: 08/12/2025

పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తో పాటు డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడి డా.కెసిహెచ్ అప్పారావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి వెంకటేశ్వర రావు జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను […]

More