వీరవాసరం మండలంలో తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
వీరవాసరం మండలంలో తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
అర్నబ్ తుపాను ప్రభావంతో వీరవాసరం మండలంలో దెబ్బతిన్న వ్యవసాయ పంటలను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించి, ప్రభావిత ప్రాంతాల్లో పంటల పరిస్థితిని, నష్టం తీవ్రతను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తుపాను ప్రభావంతో పంట నష్టానికి గురైన రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పంట నష్టాల అంచనాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నమోదు చేయాలని, ప్రభావిత ప్రాంతాల్లో పంటల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.
అనంతరం వీరవాసరం మండలంలో తుపాను కారణంగా తెగిపడిన విద్యుత్ తీగలను, ఇతర నష్టం జరిగిన ప్రాంతాలను కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ పరిశీలించారు.