Press Release

Filter by:
WhatsApp Image 2026-10-29 at 8.04.08 PM

అకివీడు మండలంలో తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటల పరిశీలన రైతులతో మాట్లాడి పంట నష్టాల వివరాలు తెలుసుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

Published on: 29/10/2026

*అకివీడు మండలంలో తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటల పరిశీలన* *రైతులతో మాట్లాడి పంట నష్టాల వివరాలు తెలుసుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ* అర్నబ్ తుపాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా అకివీడు మండలం అకివీడు గ్రామంలో దెబ్బతిన్న వరి పంటలను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ గురువారం పరిశీలించారు. పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టంపై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పంట నష్టం ఎంత […]

WhatsApp Image 2026-10-28 at 5.13.33 PM

అర్నబ్ తుపాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు జిల్లా అంతటా రెడ్ అలర్ట్ అమలులో ఉంది…జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 28/10/2026

అర్నబ్ తుపాను ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్రంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. బుధవారం వీరవాసరం ప్రాంతంలో తుపాను పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆమె, రహదారులపై కూలిన భారీ వృక్షాలను పరిశీలించి, వాటిని తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావంతో ఈదురుగాలులు, వర్షం కురుస్తున్నప్పటికీ ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ జిల్లా కలెక్టర్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న […]

WhatsApp Image 2026-10-28 at 5.19.01 PM

అత్యవసర సేవలకు విద్యుత్ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలి…జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 28/10/2026

‘అర్నబ్’ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ ఈదురుగాలులు, వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు ఏర్పడిన అంతరాయాలను తక్షణమే తొలగించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. ఉషారాణితో విద్యుత్ పునరుద్ధరణ చర్యలపై సమీక్షించారు. తుఫాన్ కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటం, విద్యుత్ […]

WhatsApp Image 2026-10-28 at 5.20.44 PM

తుపాను ప్రభావిత గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి….

Published on: 28/10/2026

తుపాను ప్రభావిత గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి…. అర్నబ్ తుపాను నేపథ్యంలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ సీఈవో, డీపీవో, ఆర్డీవోలు తదితర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తాగునీటి సరఫరాపై […]

WhatsApp Image 2026-10-28 at 5.50.01 PM

ఆరేడు గ్రామంలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ తుఫాను ప్రభావం తగ్గేవరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ

Published on: 28/10/2026

ఆర్నాబ్ తుఫాను ప్రభావం నేపథ్యంలో ఉండి మండలం ఆరేడు గ్రామంలోని పునరావాస కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ బుధవారం సందర్శించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. తుఫాను పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన […]

తుఫాను నేపథ్యంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్దరించాలని బి.ఎస్.ఎన్.ఎల్, జీయో నెట్ వర్క్ సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం

Published on: 28/10/2026

తుఫాను నేపథ్యంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్దరించాలని బి.ఎస్.ఎన్.ఎల్, జీయో నెట్ వర్క్ సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, వెస్ట్ గోదావరి జిల్లా తుఫాన్ సహాయక చర్యల ప్రత్యేక అధికారి యం యం నాయక్, ఎ పి సి పి డి సి ఎల్ సి యం డి ఎల్. శివశంకర్ తో కలిసి జిల్లా కలెక్టరేట్ లో వశిష్ఠ సమావేశ మందిరంలో చర్చించ్చారు. తుఫాను దృష్ట్యా ప్రజలకు […]

WhatsApp Image 2026-10-28 at 10.14.08 PM

జిల్లాలో తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న పంట నష్ట అంచనాలను తయారు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్

Published on: 28/10/2026

జిల్లాలో తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న పంట నష్ట అంచనాలను తయారు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారు లను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వశిష్ట సమావేశము హల్ లో అర్నబ్ తుఫాను వల్ల దెబ్బతిన్న పంట నష్టాలపై, తుఫాను సహాయక చర్యలపై జిల్లా అధికారులతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ […]

WhatsApp Image 2026-10-28 at 10.14.38 PM

అర్నబ్ తుఫాను ప్రభావం వలన కురుస్తున్న భారీ వర్షాల వలన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 28/10/2026

అర్నబ్ తుఫాను ప్రభావం వలన కురుస్తున్న భారీ వర్షాల వలన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హలో లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్.పి సి ఇ ఒ, డీపీఓ, ఆర్. డబ్ల్యూయస్, యం ఆర్ ఒ లు , యం పి డి ఒ లు తదితర అధికారులతో చేపట్టవలసిన సహాయక చర్యలపై […]

WhatsApp Image 2026-10-27 at 3.05.54 PM

రెండవ దశ ర్యాండమైజేషన్‌ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయింపు.

Published on: 27/10/2026

రెండవ దశ ర్యాండమైజేషన్‌ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయింపు. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం భారత ఎన్నికల సంఘం ర్యాండమైజేషన్‌ పద్ధతిని అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు, నరసాపురం పురపాలక సంఘం, ఆకివీడు నగర పంచాయతీ లకు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిమిత్తం ప్రిసైడింగ్‌‌అధికారి, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌‌ అధికారులను, ఇతర పోలింగ్‌‌ […]

WhatsApp Image 2026-10-27 at 3.14.17 PM

తుఫాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తం. జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన తుఫాన్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి

Published on: 27/10/2026

తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా మంగళవారంజిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన తుఫాన్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మితో కలిసి ఆమె పరిశీలించారు. తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08816299181 ఏర్పాటు చేయడమైనది అన్నారు. ఈ సందర్భంగా కంట్రోల్‌ రూమ్‌ ద్వారా నిర్వహించే […]