పశ్చిమగోదావరి జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా ప్రత్యేక అధికారి మరియు మహిళలు, పిల్లలు, వికలాంగులు & సీనియర్ సిటిజన్ల శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎ.సూర్య కుమారి పిలుపునిచ్చారు.
Published on: 19/07/2025ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఏ.సూర్యకుమారి, జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి తణుకు మాంటిసోరి హై స్కూల్, జూనియర్ కాలేజ్ ల నందు ఏర్పాటుచేసిన ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం” అనే కార్యక్రమంలో పాల్గొని, సైన్స్ స్క్వేర్ ప్రదర్శనను తిలకించి, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. తొలుత జిల్లా ప్రత్యేక అధికారి విద్యార్థులతో మాట్లాడుతూ మీరు లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ప్లాస్టిక్ వి […]
Moreగుర్రపుడెక్కతో తయారుచేసిన వర్మి కంపోస్ట్ ను రైతులు విరివిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 18/07/2025ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామంలో గ్రామ సమైక్య సభ్యులు గుర్రపు డెక్క ద్వారా తయారు చేస్తున్న వర్మీ కంపోస్ట్ యూనిట్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. తొలుత గ్రామ సమైక్య సభ్యులతో మాట్లాడుతూ తయారీ విధానాన్ని, ఎంతమంది యూనిట్ లో పనిచేస్తున్నారు, ఎన్ని రోజులకు కంపోస్ట్ తయారవుతుంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో .. భీమవరం మండలం గొల్లవానితిప్ప, […]
Moreఎంజాయ్ మెంట్ సర్వే భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 18/07/2025మొగల్తూరు మండలంలోని కాళీపట్నం రెవిన్యూ గ్రామ పరిధిలో పాతపాడు, జగన్నాధపురం, కాళీపట్నం తూర్పు, కాళీపట్నం పడమర, కొత్తోట గ్రామాల సెటిల్మెంట్ భూములు సంబంధించి శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఎంజాయిమెంట్ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ భూములకు సంబంధించిన మ్యాప్ లను పరిశీలించి, వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జగన్నాధపురం సచివాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. రికార్డులన్నీ ఏటువంటి పొరపాట్లు లేకుండా కచ్చితంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా […]
Moreఎన్ హెచ్ 165 భూసేకరణకు భూములను ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిన వీరవాసరం గ్రామ రైతులు-జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 18/07/2025జాతీయ రహదారి 165 నిర్మాణంలో భాగంగా వీరవాసరం గ్రామ రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై శుక్రవారం వీరవాసరం తహసిల్దార్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జాతీయ రహదారుల అధికారుల సమక్షంలో విచారణ చేపట్టడం జరిగింది. భూసేకరణపై జూన్ 14 న అభ్యంతరాలు గడువు ముగియడంతో, వీరవాసరం గ్రామానికి చెందిన18 మంది రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై ఈరోజు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు రోడ్డు అలైన్మెంట్, తమ భూమికి లభించే నష్టపరిహారం చెల్లింపు తదితర […]
Moreబంగారు కుటుంబాలకు పి4 అమలలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి
Published on: 18/07/2025పి4 బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు హృదయం ఉన్న దాతలు ముందుకు రావాలి శుక్రవారం కాళ్ల మండలం బొండాడ గ్రామంలో పి4 గ్రామసభను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఇప్పటికే బొండాడ గ్రామంలో గుర్తించిన 128 బంగారు కుటుంబాలకు సంబంధించిన డేటాను గ్రామ సెక్రెటరీ గ్రామసభలో పేరుపేరునా చదివి వినిపించగా, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వారి యెక్క స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నాను. ఈ సందర్భంలో అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ […]
Moreభవ్య భీమవరం పేరిట చేపట్టిన అభివృద్ధి పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి అయ్యేలా కృషి చేయాలని దాతలు, అధికారులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 17/07/2025గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భవ్య భీమవరం అభివృద్ధి పనులపై దాతలు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఇప్పటికే పనులు ప్రారంభించి ఆరు నెలలు దాటిందని, వచ్చే ఆగస్టు 15 నాటికి పనులను పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు. భీమవరం పాత బస్టాండ్ పనులపై సమీక్షిస్తూ ఇంకా ఏమేమి పనులు పూర్తి చేయవలసి ఉందని ఆరా తీశారు. అలాగే హౌసింగ్ బోర్డ్ కాలనీలోని […]
Moreఅతిసార వ్యాధి బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు వైద్యుల సూచనలను తప్పనిసరిగా ఆచరించాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 16/07/2025అతి సార వ్యాధి లక్షణాలు కనబడితే తక్షణమే సమీప ఆరోగ్య కేంద్రం వైద్యులను సంప్రదించాలి బుధవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ సమావేశమందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అతిసారా వ్యాధి నివారణ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతిసారా వ్యాధిబారిన పడకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ వైద్యులు సూచించిన జాగ్రత్తలను పాటించాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమం జూన్ 16వ […]
Moreకోర్సుల ఎంపికలో ఒకరిని అనుకరించకుండా ఉద్యోగ అవకాశాలు ఉన్న కోర్సులను ఎంపిక చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యార్థులకు సూచించారు
Published on: 16/07/2025బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రాయలం రోడ్డులోని రాజా రామ్మోహన్ రాయ్ ద్విశత జయంతి (ఆర్ ఆర్ డిఎస్) డిగ్రీ కాలేజ్ లో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత సిఎస్ఆర్ పండ్స్ 5 లక్షల 60 వేల రూపాయలు వ్యయంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ డిగ్రీ కోర్సు ఏమి తక్కువ కాదని, కష్టపడి చదివితే ఏ […]
Moreజిల్లాలో శిశు జనన రేటు పెరిగే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి .
Published on: 16/07/2025మాతృ, శిశు ఆరోగ్యం కోసం గర్భధారణ, బిడ్డకు, బిడ్డకు మధ్య అంతరంపై దంపతులకు అవగాహన కల్పించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలి. జూలై 11న నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం దంపతులు ఒక బిడ్డతో సరిపెట్టుకుంటున్నారని దానివల్ల భవిష్యత్తులో యువ జనాభా తగ్గిపోతుందన్నారు. మన […]
Moreవర్షాకాలం సీజన్ దృష్టిలో ఉంచుకొని అధిక వర్షాలు, వరదలు పట్ల అప్రమత్తంగా ఉండాలి..
Published on: 16/07/2025శివారులోని ప్రతి ఎకరానికి సాగునీరు అందాలి… జల వనరుల శాఖ అధికారులు నిరంతరాయంగా క్షేత్రస్థాయిలో నీటి సరఫరాను పర్యవేక్షించాలి… విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవ్.. … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. వరి సాగుకు అవసరమైన సాగునీటిని శివారు భూములకు సైతం ఆటంకం లేని విధంగా సరఫరాకు జల వనరుల శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వశిష్ట సమావేశ మందిరం […]
More