Close

Press Release

Filter by:

ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు రోగులకు నమ్మకంతో కూడిన నాణ్యమైన వైద్య సేవలు అందించాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి .

Published on: 22/07/2025

నిర్దేశించిన లక్ష్యాలు సాధించని పీహెచ్సీ వైద్యాధికారులపై కలెక్టర్ ఆగ్రహం. రోగులకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు. ప్రతినెల 3 వేల ఓపి, పది డెలివరీలు ఉండాల్సిందే… రోగుల నుండి ఎవరైనా సిబ్బంది సొమ్ము డిమాండ్ చేస్తే సస్పెన్షన్ తప్పదు. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖల పని తీరుపై […]

More

విద్యార్థులకు వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలి-జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 21/07/2025

మెనూ ప్రకారం వంటలను రుచికరంగా చేయాలి ప్రభుత్వ బాలికల వసతి గృహం ఆకస్మిక తనిఖీ జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి భీమవరం మండలంలోని దిరుసుమర్రు గ్రామంలో మూడవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు నిర్వహిస్తున్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహమును సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు వసతి గృహంలో వారికి అందుతున్న సేవల […]

More

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోండి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 21/07/2025

జనవరి 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ 2026 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు […]

More

రాబోయే రబి కాలంలో కెఎన్ఎం 12368 సన్నని ధాన్యం రకం పండించడానిక రైతులను ప్రోత్సహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

Published on: 21/07/2025

భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో కెఎన్ఎం 12368 అనే సన్నని ధాన్యం వరినాట్లు వేసిన పొలాన్ని సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆ రకం యొక్క గుణగణాల్ని, మార్కెట్ విధానంపై పలు సూచనలు చేశారు. వ్యవసాయ అధికారులతో రైస్ మిల్లర్లను అనుసంధానం చేసి ఈ రకం ఓపెన్ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ అమ్ముడు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కెఎన్ఎం 12368 రకం రాబోయే రబి […]

More

జిల్లాలోని వ్యవసాయ ఆధారిత భూములలో ఎరువుల వినియోగం తగ్గించి పచ్చిరొట్ట వినియోగించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 21/07/2025

సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా “పచ్చిరొట్ట ఫైర్లకు వాడడం ద్వారా చేకూరే ప్రయోజనాలపై” గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అధిక ఎరువులు వినియోగం కారణంగా భూసారం దెబ్బతిని జీవం కోల్పోవడంతో భూమి సాగుకు పనికి రాకుండా పోతుందన్నారు. పచ్చిరొట్ట పైర్లను వాడడం ద్వారా 25% ఎరువులను ఆడా చేసుకోవచ్చు అన్నారు. పచ్చిరొట్ట ఎరువుతో మట్టికి జీవం వస్తుంది అన్నారు. వర్షాకాలానికి ముందు […]

More

పి జి ఆర్ ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

Published on: 21/07/2025

ఫిర్యాదుదారులతో మాట్లాడి నిర్గీత గడువలోపున నాణ్యమైన పరిష్కారం చూపాలి. పెంచి పోషించిన ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులు పట్ల ప్రేమ, అనురాగాలు కలిగి ఉండాలి వృద్ధులైన తల్లిదండ్రులు నిరాధారణకు గురి చేస్తే చర్యలు తప్పవు.. .. జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా […]

More

జిల్లాలో మార్గదర్శకుల నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 21/07/2025

మానవ సేవే…… మాధవ సేవ… ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం… కష్టాలలో ఉన్న వారికి మనోధైర్యం కల్పించడం కూడా సమాజసేవలో భాగమే. పి4 లో భాగంగా మార్గదర్శకుల నమోదు, బంగారు కుటుంబాల అనుసంధానం అంశంపై సోమవారం జిల్లా కలెక్టరేట్ చదలవాడ నాగరాణి పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సమాజంలో పేద, బడుగు బలహీన వర్గాల వారిని ఆర్థికంగా, సామజికంగా బలోపేతం చేసేందుకు పి4 కార్యక్రమాన్ని […]

More

ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు-జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 19/07/2025

ఏ.ఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. పశ్చిమగోదావరి జిల్లా పరిపాలన యంత్రాంగం ఆధ్వర్యంలో ఎస్సి, ఎస్టి, బీసీ, ఒబిసి, ఇబిసి ధ్రువ పత్రాల జారీ, ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై శనివారం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన రెవెన్యూ ఉద్యోగుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖలలో రెవెన్యూ శాఖ […]

More

జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి-జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 19/07/2025

స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా ప్రతి నెల మూడో శనివారం నాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా శనివారం భీమవరం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో మావుళ్ళమ్మ టెంపుల్ వద్ద ఏర్పాటుచేసిన సభకు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గత 6 నెలలుగా పశ్చిమగోదావరి జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా […]

More

విద్యార్థులకు చిన్న నాటి నుండే పర్యావరణంపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించడం ద్వారా, ప్లాస్టిక్ ని సమర్థవంతంగా నిరోధించవచ్చని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Published on: 19/07/2025

మూడవ శనివారం స్వచ్ఛంద స్వర్ణంద్ర కార్యక్రమంలో భాగంగా “స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలన” పై తణుకు జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పారిశుధ్యాన్ని మెరుగు పరిచేందుకు, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతీ నెలా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రతినెల ఒక థీమ్ తో నిర్వహిస్తున్నామని, ప్లాస్టిక్ నిర్మూలనే లక్ష్యంగా […]

More