ఇటీవల సంభవించిన ముసురు తుఫాను ప్రభావంతో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విస్తృత పర్యటన చేపట్టారు.

Publish Date : 09/11/2026
WhatsApp Image 2026-11-09 at 3.32.26 PM

ఇటీవల సంభవించిన ముసురు తుఫాను ప్రభావంతో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విస్తృత పర్యటన చేపట్టారు.
ఈ పర్యటనలో భాగంగా మాధవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వరద ముంపు ప్రాంతాలను జిల్లా వైద్యాధికారి స్వయంగా పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను తనిఖీ చేసి, బాధితులకు అందుతున్న సరఫరా, ఔషధాల లభ్యతను సమీక్షించారు.
ముఖ్యమైన సూచనలు మరియు ఆదేశాలు:
* మెడికల్ క్యాంపుల తనిఖీ: మాధవరం PHC పరిధిలోని వైద్య శిబిరాల్లో అత్యవసర మందులు, ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, క్లోరిన్ మాత్రలు అందుబాటులో ఉంచాలని, బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.
అనంతరం పెంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను, ల్యాబ్ సేవలను మరియు సిబ్బంది హాజరును పరిశీలించారు.
* వ్యాధుల నివారణ చర్యలు: ముంపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమల ద్వారా మరియు నీటి ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధులు (డెంగ్యూ, మలేరియా, గ్యాస్ట్రోఎంట్రైటిస్ వంటివి) ప్రబలకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
* తాగునీటి శుద్ధి: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వనరులను నిరంతరం క్లోరినేషన్ చేయాలని, ప్రజలకు కాచి చల్లార్చిన నీటిని తాగేలా అవగాహన కల్పించాలని సూచించారు.
* సిబ్బందికి హెచ్చరిక: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎమ్‌లు , ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉంటూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో జిల్లా వైద్యాధికారితో పాటు సంబంధిత మెడికల్ ఆఫీసర్లు, ఆరోగ్య విస్తరణ అధికారులు మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.