బియ్యం ధరలు నియంత్రణపై ప్రత్యేక చర్యలు జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ

Publish Date : 11/11/2026
WhatsApp Image 2026-11-11 at 6.59.04 PM

బియ్యం ధరలు నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ అన్నారు,
జిల్లాలోని బియ్యం హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు,మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ , బుధవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జిల్లా జాయింట్ కలెక్టర్ కె ఆర్ కల్పశ్రీ సమీక్ష సమావేశం నిర్వహించారు .
ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ బియ్యం ధరల నియంత్రణ కొరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారు వెరైటీ వారీగా బియ్యం రిటైల్ అమ్మకం ధరలను నిర్ణయించిన రేట్లకే మాత్రమే అమ్మాలన్నారు. ఎక్కువ రేట్లకు అమ్మే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం నియమించిన ధరల కంటే ఎక్కువ ధరలు అమ్మే వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బియ్యం ధరలు ప్రతి బియ్యం బస్తాపై ముద్రించేలాగా మరియు ప్రతి బియ్యం షాప్ నందు రేట్ల పట్టికను ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రతి రైస్ మిల్లర్లు, బియ్యం హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులు ఖచ్చితంగా వెరైటీ వారీగా బియ్యం నిల్వలను https://foodstocks.dfpd.gov.in లో ప్రతి శుక్రవారం నమోదు చేయాలని సూచించారు బియ్యం ధరల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన బియ్యం కె జీ ల లో బి పి టి సోన సాంబ కె ఎన్ ఎం రకం
రూ.66, హెచ్ ఎం టి ఆర్ ఎన్ ఆర్ రకం రూ.76, స్వర్ణ మసూరీ బియ్యా కిలో రూ.47,జై శ్రీ రామ్
రకం రూ.82,కి అమ్మాలన్నారు.
అలాగే బియ్యం ధరల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన బిపిటి కేఎన్ఎం రకo బియ్యాన్ని కిలో ఒక్కింటికీ రూ.49,మరియు రూ.50, చొప్పున జిల్లాలోని ప్రజలకు రైతుబజార్ల ద్వారా వారి ఆధార్ కార్డుపై గరిష్టంగా 26 కేజీల బస్తాని అమ్మకం చేస్తున్నారు. ఈ బియ్యం కౌంటర్లను అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ఏర్పాటు చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయుటకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె ఆర్ కల్పశ్రీ ఆదేశించారు.