అకివీడు మండలంలో తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటల పరిశీలన రైతులతో మాట్లాడి పంట నష్టాల వివరాలు తెలుసుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
*అకివీడు మండలంలో తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటల పరిశీలన*
*రైతులతో మాట్లాడి పంట నష్టాల వివరాలు తెలుసుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ*
అర్నబ్ తుపాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా అకివీడు మండలం అకివీడు గ్రామంలో దెబ్బతిన్న వరి పంటలను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ గురువారం పరిశీలించారు. పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టంపై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పంట నష్టం ఎంత మేరకు జరిగిందనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని, తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటల పరిస్థితిని పరిశీలించారు. పంట నష్టాల అంచనాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నమోదు చేయాలని, ప్రభావిత ప్రాంతాల్లో పంటల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ వంశీ సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు ఉన్నారు.