Press Release
అత్యవసర సేవలకు విద్యుత్ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలి…జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 28/10/2026‘అర్నబ్’ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ ఈదురుగాలులు, వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు ఏర్పడిన అంతరాయాలను తక్షణమే తొలగించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. ఉషారాణితో విద్యుత్ పునరుద్ధరణ చర్యలపై సమీక్షించారు. తుఫాన్ కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటం, విద్యుత్ […]
తుపాను ప్రభావిత గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి….
Published on: 28/10/2026తుపాను ప్రభావిత గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి…. అర్నబ్ తుపాను నేపథ్యంలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ సీఈవో, డీపీవో, ఆర్డీవోలు తదితర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తాగునీటి సరఫరాపై […]
ఆరేడు గ్రామంలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ తుఫాను ప్రభావం తగ్గేవరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ
Published on: 28/10/2026ఆర్నాబ్ తుఫాను ప్రభావం నేపథ్యంలో ఉండి మండలం ఆరేడు గ్రామంలోని పునరావాస కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ బుధవారం సందర్శించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. తుఫాను పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన […]
తుఫాను నేపథ్యంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్దరించాలని బి.ఎస్.ఎన్.ఎల్, జీయో నెట్ వర్క్ సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం
Published on: 28/10/2026తుఫాను నేపథ్యంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్దరించాలని బి.ఎస్.ఎన్.ఎల్, జీయో నెట్ వర్క్ సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, వెస్ట్ గోదావరి జిల్లా తుఫాన్ సహాయక చర్యల ప్రత్యేక అధికారి యం యం నాయక్, ఎ పి సి పి డి సి ఎల్ సి యం డి ఎల్. శివశంకర్ తో కలిసి జిల్లా కలెక్టరేట్ లో వశిష్ఠ సమావేశ మందిరంలో చర్చించ్చారు. తుఫాను దృష్ట్యా ప్రజలకు […]
జిల్లాలో తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న పంట నష్ట అంచనాలను తయారు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
Published on: 28/10/2026జిల్లాలో తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న పంట నష్ట అంచనాలను తయారు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారు లను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వశిష్ట సమావేశము హల్ లో అర్నబ్ తుఫాను వల్ల దెబ్బతిన్న పంట నష్టాలపై, తుఫాను సహాయక చర్యలపై జిల్లా అధికారులతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ […]
అర్నబ్ తుఫాను ప్రభావం వలన కురుస్తున్న భారీ వర్షాల వలన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 28/10/2026అర్నబ్ తుఫాను ప్రభావం వలన కురుస్తున్న భారీ వర్షాల వలన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హలో లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్.పి సి ఇ ఒ, డీపీఓ, ఆర్. డబ్ల్యూయస్, యం ఆర్ ఒ లు , యం పి డి ఒ లు తదితర అధికారులతో చేపట్టవలసిన సహాయక చర్యలపై […]
రెండవ దశ ర్యాండమైజేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయింపు.
Published on: 27/10/2026రెండవ దశ ర్యాండమైజేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయింపు. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం భారత ఎన్నికల సంఘం ర్యాండమైజేషన్ పద్ధతిని అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు, నరసాపురం పురపాలక సంఘం, ఆకివీడు నగర పంచాయతీ లకు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిమిత్తం ప్రిసైడింగ్‌అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను, ఇతర పోలింగ్ […]
తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తం. జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి
Published on: 27/10/2026తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా మంగళవారంజిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మితో కలిసి ఆమె పరిశీలించారు. తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08816299181 ఏర్పాటు చేయడమైనది అన్నారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ ద్వారా నిర్వహించే […]
ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాలెట్ బాక్సులు భద్రపరచు గదులు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు ఐఏఎస్ అధికారి బి.నవ్య
Published on: 27/10/2026ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాలెట్ బాక్సులు భద్రపరచు గదులు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు ఐఏఎస్ అధికారి బి.నవ్య భీమవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే గదులు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను సాధారణ ఎన్నికల పరిశీలకులు ఐఏఎస్ అధికారి బి నవ్య, మంగళవారం పరిశీలించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఐఎఫ్‌ఎస్ అధికారి అహ్మద్ అబ్దుల్ రావుఫ్ షేక్, జిల్లా జాయింట్ కలెక్టర్ […]
జిల్లా లో 24 పునరావాస కేంద్రాలలో మెడికల్ క్యాంపులు, విద్యుత్ జనరేటర్లు ఏర్పాటు.పునరావాస కేంద్రాల్లో సిబ్బంది విధులకు సిద్ధం. అర్నబ్ తుఫాను ముప్పు ఎదుర్కునేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు సిద్ధం. గంటకు 140–150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
Published on: 27/10/2026వాతావరణ శాఖ అధికారిక సమాచార నిమిత్తం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దృష్ట్యా అక్టోబర్ 28 తేదీ న జిల్లా నుంచే తీరం దాటే అవకాశం ఉన్నదని, అత్యంత తీవ్ర తుఫాను వలన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ** తుఫాన్ ప్రభావం దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు టెలి కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లా కలెక్టర్లకు తుఫాన్ ప్రభావం, చేపట్టవలసిన సహాయక చర్యలు, తీసుకోవలసిన […]